చిక్కుల్లో నిమ్మగడ్డ ? సభా హక్కుల నోటీసులు !

కేవలం తమ పార్టీని టార్గెట్ చేసుకుంటూ, ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు వెళ్తున్నారు అనే అభిప్రాయం ఏపీ అధికార పార్టీ వైసీపీకి మొదటి నుంచి ఉంది.నిమ్మగడ్డకు, వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన వివాదం చివరకు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే విధంగా అనుకూలంగా తీర్పు వెలువడింది.

 Ap Government Gives Notices To Nimmagadda Ramesh Kumar, Nimmagadda Ramesh Kumar,-TeluguStop.com

ఇక అప్పటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది.వైసీపీ నాయకుల నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదరువుతున్నా, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ నిమ్మగడ్డ వస్తున్నారు.

దీంతో వైసిపి ప్రతిపక్షాలతో పాటు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుకు బ్రేకులు వేసే విధంగా అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది.తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సభా హక్కుల నోటీసు ఇవ్వడం సంచలనంగా మారింది.

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు నిమ్మగడ్డ తమను తీవ్రంగా అవమానించారని, ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంటూ నోటీసు ఇచ్చారు.ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, నిమ్మగడ్డకు నోటీసు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్వెలువడిన తరువాత నిమ్మగడ్డ, వైసిపి నాయకులు మధ్య వివాదం మరింతగా ముదిరిపోతూ వస్తోంది.నిమ్మగడ్డను ఫిర్యాదు ఇచ్చినా, మా ఇంట్లో గొడ్లకు ఇచ్చినా ఒకటే అంటూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

నిమ్మగడ్డ చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారు అని పెద్దిరెడ్డి, మంత్రి బొత్స సైతం కామెంట్ చేశారు.ఈ వ్యవహారాలపై ఆగ్రహం చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంత్రులతో పాటు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కు లేఖ రాశారు.

Telugu Ap, Chandrababu-Telugu Political News

ఇది ఇలా ఉండగానే నిమ్మగడ్డకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది.కేవలం నోటీసుతో సరిపెట్టకూడదు అని, ఆయన వ్యవహారశైలిపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని, అవసరమైతే కోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.ఏది ఏమైనా ఒకవైపు అధికారులు, వైసిపి నాయకులు మంత్రులు అంత నిమ్మగడ్డను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా, నిమ్మగడ్డ సైతం సీరియస్ గానే తాను చేయాలి అనుకున్న పనిని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు గా కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube