రేప్ సన్నివేశాల్లో నటించినందుకు ఈ నటుడు చాలా ఫీలయ్యాడట.. కానీ...

ఒకప్పుడు తన విలనిజంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ విలన్ “సత్య ప్రకాష్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే సత్య ప్రకాష్ అప్పట్లో విలన్ గా నటించిన  నరసింహనాయుడు, ఎదురులేని మనిషి, సీతారామ రాజు, పోకిరి, లక్ష్మి, మరిన్ని తదితర చిత్రాలు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

 Telugu Villain Satya Prakash Worried About His Villain Roles In Films, Satya Pra-TeluguStop.com

 అంతేకాక సత్య ప్రకాష్ కి కూడా నటుడిగా సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చాయి. కాగా తాజాగా సత్య ప్రకాష్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ జీవితానికి సంబంధించిన పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా సినిమా చూసేటువంటి ప్రేక్షకులకు రేప్ సన్నివేశాలు మరియు విలనిజం సన్నివేశాలు బాగానే నచ్చినప్పటికీ, అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తాము ఎంతో కష్టపడతామని తెలిపాడు. అంతేగాక ఇలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు ఒక్కోసారి ఎందుకు అలాంటి సన్నివేశాల్లో నటించామా.?  అనే సందేహాలు కలగడంతో పాటు ఇలాంటి సన్నివేశాలు జనాల పై తీవ్ర ప్రభావం చూపుతాయని కూడా తెలిపాడు.కాగా ఆ మధ్య తాను విలన్ గా నటించిన “పోలీస్ స్టోరీ” చిత్రాన్ని తమిళనాడుకు చెందిన గ్యాంగ్ స్టార్ చూసి ఏకంగా తన పేరుని సత్య గా మార్చుకున్నట్లు ఉత్తరం కూడా రాశాడని తెలిపాడు.

అంతేగాక మహేష్ బాబు హీరోగా నటించినటువంటి పోకిరి చిత్రంలో కూడా తాను మంచానికి కట్టేసుకుని నటించిన సన్నివేశాన్ని కూడా ఓ పోలీస్ అధికారి ఇమిటేట్ చేసినట్లు కూడా తెలిపాడు.

Telugu Satya Prakash, Telugu Villain, Teluguvillain, Tollywood, Villains-Movie

తాను కేవలం పాత్ర డిమాండ్ చేయడం వల్లే అలా నటిస్తానని అంతే తప్ప నిజ జీవితంలో తన స్వభావం పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.అంతేకాక ఇప్పుడున్నపరిస్థితులలో ఎక్కువగా ప్రజలు హీరోల కంటే విలన్లను ఇష్టపడుతున్నారని అలాగే అప్పట్లో మాదిరిగా ఇప్పుడు విలన్లు భారీ డైలాగులు చెప్పడం, తమ నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ ఏదో అలా నెట్టుకొస్తున్నారని చెప్పుకొచ్చాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా సత్య ప్రకాష్ ఇటీవలే తన కొడుకు నటరాజ ను “ఉల్లాలఉల్లాల” అనే చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు.

కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube