ఈ తెలుగు హీరోయిన్ సినిమా అవకాశాలు లేక సీరియళ్ళలో నటిస్తుందట...

చలన చిత్ర పరిశ్రమలో వచ్చీరావడంతోనే సినిమా హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకొని ఆ తర్వాత తమ తదుపరి చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక తెర మరగైపోయిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అయితే ఇందులో తెలుగులో ప్రముఖ దర్శకుడు రవి బాబు దర్శకత్వం వహించిన “అమ్మాయిలు అబ్బాయిలు” చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “దెబినా బెనర్జీ” ఒకరు.

 Telugu Ramayan Serial Fame Debina Bonnerjee Marriage And Movie Offers News, Debi-TeluguStop.com

ఈ అమ్మడు వచ్చీరావడంతోనే తన మొదటి చిత్రంతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. దీంతో కన్నడ, హిందీ, తదితర భాషల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది.

 కానీ ఈ అమ్మడు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో హీరోయిన్ గా ఎవరూ గుర్తించలేదు. దీంతో క్రమక్రమంగా సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టున ఎక్కువ కాలం గడిపింది.

దీంతో 2011 వ సంవత్సరంలో గుర్మీత్ చౌదరి అనే సీరియల్ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి బుల్లితెరపై దృష్టి సారించింది.

 ఈ క్రమంలో దాదాపుగా 20 కి పైగా ధారావాహికలలో నటించింది.సినిమాల పరంగా హీరోయిన్ గా పెద్దగా రాణించలేక పోయినటువంటి  దెబినా బెనర్జీ ప్రస్తుతం బుల్లితెరలో దూసుకుపోతోంది.

దీనికితోడు ఈమె భర్త  గుర్మీత్ చౌదరి కూడా సీరియల్ లో హీరోగా నటిస్తుండటంతో ఈ అమ్మడి కెరియర్ కి మరింత ప్లస్ అయ్యింది.కాగా ప్రస్తుతం దెబినా బెనర్జీ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో నివాసముంటోంది.

అయితే తెలుగులో దేబినా బెనర్జీ మరియు ఆమె భర్త గూర్మీత్ చౌదరి కలిసి రామాయణం (తెలుగు అనువాదం) ధారావాహికలో నటించారు.అలాగే దెబినా బెనర్జీ పలు కంపెనీల ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించి బాగా అలరించింది.

Telugu Telugu, Teluguramayan, Tollywood-Movie

కాగా గుర్మీత్ చౌదరి హిందీలో కామోషియన్, వాజ్ తుమ్ హో, లాలి కి షాది మెయిన్ లడ్డు దివానే, పల్టాన్ తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. అంతేగాక పలు రియాలిటీ షోలలో కంటెస్టెంట్ గా పాల్గొని ఇటు బుల్లితెర ప్రేక్షకులని బాగానే అలరించాడు.ఇక దెబినా బెనర్జీ విషయానికొస్తే ఈ అమ్మడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా ఐదు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఇందులో తెలుగులో దెబినా బెనర్జీ హీరోయిన్ గా నటించిన “అమ్మాయిలు అబ్బాయిలు” చిత్రం తప్ప మిగిలిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube