వైరల్ వీడియో: మెరుపు వేగం తో ఫీల్డింగ్ అదరగొట్టిన సంజూ..!

తాజాగా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా – టీమ్ ఇండియా జట్ల మధ్య టి20 సిరీస్ ముగిసింది.ఈ సీరీస్ లో భాగంగా మొత్తం 3 మ్యాచ్ లలో మొదటి రెండు మ్యాచ్ లలో టీమిండియా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోగా తాజాగా జరిగిన మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచి 2 – 1 తో సిరీస్ ను ఇండియా కైవసం చేసుకుంది.

 Sanju Samson Catch India-australia T20 Match Viral In Social Media, Sanju Samson-TeluguStop.com

గత మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటగా ఆసీస్ ను బ్యాటింగ్ కు పంపించగా నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు చేయగలిగింది.భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా చివరికి 12 పరుగుల తేడాతో మ్యాచ్ ఆస్ట్రేలియా కు అప్పగించింది.

అయితే ఫీల్డింగ్ సమయంలో టీమిండియా జట్టు సభ్యులు అనేక తప్పిదాల కారణంగా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కు వరంగా మారింది.పలు క్యాచ్ లను నేలపాలు చేయడంతో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు కు దారి తీసింది.

పరిస్థితి ఇలా ఉండగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసిన సమయంలో యువ ఆటగాడు సంజూ శాంసన్ ఓ అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శనతో అందరిని అబ్బురపరిచాడు.ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 13 ఓవర్లో మ్యాచ్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ వేడ్ భారీ షాట్ కు ప్రయత్నించగా ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద వెళ్లే బంతిని కళ్లు చెదిరేలా ఆపగలిగాడు సంజూ శాంసన్.

దాదాపు సంజు శాంసన్ చేసిన ప్రయత్నానికి బ్యాట్స్మెన్ అవుట్ అని భావించిన తృటిలో అవుట్ నుండి తప్పించుకున్నాడు.

ఆ సమయంలో సంజూ శాంసన్ అందరు అనుకున్న సమయంలో ఆ బంతిని నిలువరించి క్యాచ్ పట్టినా కూడా దానిని బ్యాలెన్స్ పట్టుకోలేక బౌండరీ లైన్ దాటే సమయంలో బంతిని గ్రౌండ్ లోకి విసిరేసాడు.

దీంతో ఆ సమయంలో 6 పరుగులు ఆస్ట్రేలియా జట్టుకు రావాల్సి ఉండగా కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి.ఈ ఫీల్డింగ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube