ఉసిరికాయ.దీని గురించి పరిచయాలు అవసరం లేదు.
పుల్ల పుల్లగా ఉండే ఈ ఉసిరికాయలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు.కొందరు మాత్రం అస్సలు ఉసిరికాయలను ఇష్టపడరు.
మరికొందరు ఉసిరి కాయలతో ఊరగాయలు, చట్నీలు తయారు చేస్తుంటారు.అయితే వింటర్ సీజన్లో విరి విరిగా లభించే ఉసిరి కాయలు ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగా ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు.
ముఖ్యంగా ఉసిరి కాయలతో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల పొందే బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు.ప్రతి రోజు మితంగా ఉసిరి జ్యూస్ తీసుకుంటే.
అందులో పుష్కలంగా ఉంటే యాంటీఆక్సిడెంట్స్ వృద్ధాప్య కణాలతో పోరాడి చర్మాన్ని ఎప్పుడు యవ్వనంగా ఉండేలా చూస్తుంది.అలాగే ఉసిరి జ్యూస్‌లో విటమిన్ సి చర్మాన్ని మరింత కాంతివంతంగా, మృదువుగా మారుస్తుంది.
ఉసిరి జ్యూస్ తీసుకోవడం వల్ల మొటిమల సమస్య కూడా ఉండదు.ఇక ఈ చలి కాలంలో రోగాలు దరి చేరకుండా ఉండాలంటే.
శరీర రోగ నిరోధక వ్యవస్థ బలపడటం చాలా అవసరం.
అయితే ఉసిరి జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల.అందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, ఆస్ట్రింజెంట్ లక్షణాలు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.అలాగే అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఉసిరి జ్యూస్ గ్రేట్‌గా సహాయపడుతుంది.
అవును, ప్రతి రోజు ఉసిరి జ్యూస్ సేవించడం వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయి ఉన్న కొవ్వు కరిగి.బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. మధుమేహం ఉన్న వారు కూడా ఉసిరి జ్యూస్ తాగడం వల్ల.రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి.
ఇక ఉసిరి జ్యూస్‌లో కాల్షియం, పోటాషియం కూడా సమృద్ధిగానే ఉంటాయి.అందువల్ల, ఉసిరి జ్యూస్ తీసుకుంటే ఎముకలు, దంతాలు మరియు కండరాలు దృఢంగా మారతాయి.అలాగే ఈ చలి కాలంలో ఖచ్చితంగా ఉసిరి జ్యూస్ తీసుకుంటే.జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.