త్వరపడండి.. 2 రోజులు నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..!

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారతదేశం వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.శని, ఆదివారాలలో నెట్‌ఫ్లిక్స్ ను ఎటువంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా ప్రతి సమాచారాన్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అంటూ నెట్‌ఫ్లిక్స్ తెలియజేసింది.

 Netflix Is Free For 2 Days Hurryup,ott Platform, Netflix, User Data, Free, Tstin-TeluguStop.com

ఈ రెండు రోజులు నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న ప్రతి ఫీచర్ ని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చని నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం తెలిపింది. 48 గంటల పాటు ఎలాంటి వీడియో అయిన నెట్‌ఫ్లిక్స్ లో ఉచితంగా చూడవచ్చని అలాగే ఇందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరమే లేదని, అంతేకాదు అందుకు సంబంధించి ఎలాంటి పేమెంట్ వివరాలను ముందుగానే తెలపాల్సిన అవసరం లేదని నెట్‌ఫ్లిక్స్ తెలియజేసింది.

అయితే ఇందుకు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ ఓ వివరాన్ని తెలియచేసింది.ఇందులోభాగంగానే ఇప్పుడు ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవాలంటే ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కు ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఉండకూడదని, కేవలం కొత్త ఈమెయిల్ ఐడి.కొత్త ఫోన్ నెంబర్లను కలిగి ఉన్నవారు మాత్రమే ఈ ఆఫర్ ని పొందవచ్చని నెట్‌ఫ్లిక్స్ తెలియజేసింది.ఇందుకు సంబంధించి కొత్త వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో వీక్షించడం లేకపోతే, నెట్‌ఫ్లిక్స్ వెబ్ సైట్ కి వెళ్లి అక్కడ పొందుపర్చాల్సిన వివరాలను తెలిపి కొత్త అకౌంట్ నమోదు చేసుకుని 48 గంటల పాటు ఉచిత స్ట్రీమింగ్ ను పొందవచ్చు.

అయితే ఇందులో కేవలం స్టాండర్డ్ డెఫినిషన్ రిజల్యూషన్ సంబంధించి వీడియోలు మాత్రమే చూపించబోతున్నారు.ఒకవేళ హెచ్ డి క్వాలిటీ సంబంధించిన వీడియోలు చూడాలంటే హెచ్ డి ప్లాన్ కు మారాలని చూపిస్తుంది.

ఇందుకు సంబంధించి ప్రత్యేక రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ సీఈవో మాట్లాడుతూ.ముందుగా నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న సినిమాలు, టీవీ షోలు, సిరీస్ సంబంధించి విషయాలను పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత వారే అలవాటు పడతారు అంటూ చెప్పుకొచ్చారు.ఇందుకోసమే తాము ఈ ఆఫర్ ను ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube