సంక్రాంతికి ఫిక్సయిన రవితేజ క్రాక్ మూవీ

సంక్రాంతి సీజన్ అంటే సినిమా ఇండస్ట్రీకి చాలా స్పెషల్.జనవరి అంటే ఇంకా ప్రత్యేకం.

 Raviteja Krack Movie Plan To Release In Sankranthi, Tollywood, Telugu Cinema, So-TeluguStop.com

ఆ నెలలో వస్తే సినిమా హిట్ అయితే ఇక కలెక్షన్స్ పరంగా మోత మోగించొచ్చు.ఏవరేజ్ అయినా కూడా ఎలాంటి నష్టాలు లేకుండా గట్టెక్కొచ్చు.

ఈ విషయం చాలా మంది దర్శక, నిర్మాతలు, హీరోలకి తెలుసు.అందుకే సంక్రాంతి సీజన్ల లో తమ సినిమాలు ఉండే విధంగా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు.

అయితే సంక్రాంతి రేసులో స్టార్ హీరోల సినిమాలు ఉంటే మాత్రం కాస్తా వెనక్కి తగ్గుతారు.అయితే ఈ సారి సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు ఉండే అవకాశం లేదా అంటే అప్పుడే ఏమీ చెప్పలేం.

దిల్ రాజు నుంచి పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్ ఉన్నా అది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.అయితే దసరా సందర్భంగా ఇద్దరు హీరోలు మాత్రం రిలీజ్ బెర్త్ లు కన్ఫర్మ్ చేసుకున్నారు.
హీరో రామ్ తన రెడ్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు.ఇదిలా ఉంటే మాస్ మహారాజ్ రవితేజ నుంచి వస్తున్న క్రాక్ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

చాలా గ్రాండ్ గా సంక్రాంతి రేస్ లో దూకపోతున్నట్లు తెలియజేశారు.అయితే వీరిద్దరే సంక్రాంతికి వస్తారా అంటే నితిన్ కూడా తన రంగ్ దే సినిమాతో సంక్రాంతినే టార్గెట్ పెట్టాడు.

అయితే ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.ఇక ఒకే సారి కుర్ర హీరోలు, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సంక్రాంతి ఫెస్టివల్ మీద పడితే ప్రేక్షకులకి మాత్రం ఫుల్ బోనాంజా అందించినట్లే అవుతుంది.

అయితే వీరిలో మళ్ళీ ఎవరైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా, లేదా అనేది డిసెంబర్ ఆఖరికి క్లారిటీ వచ్చేస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube