ప్రేమలో మోసపోవడం లేదంటే ఓడిపోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది.జీవితంలో ప్రేమ కారణంగా బాధపడని వారంటూ ఉండరు.
ఏదో ఒక సందర్భంగా ఈ ప్రేమ ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది.అయితే టీనేజ్ లో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రేమలో పడటం జరుగుతుంది.
అయితే మనం ప్రేమించిన వ్యక్తులు ఎలాంటి వారు.నిజంగా మన ప్రేమలో నిజాయితీ ఉందా లేదంటే కేవలం ఆకర్షణ మాత్రమేనా అనే విషయాలు తెలుసుకొని జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకి వెళ్లే వారు ఎంచుకున్న మార్గంలో విజయతీరాలకి చేరుతారు.
అయితే ఆ సమయంలో అన్నిటికంటే ప్రేమ మాత్రమే గొప్పది అనే ఫీలింగ్ లో ఉన్నవారు ఆ ప్రేమ కోసం ఎంత వరకైనా వెళ్తారు.అయితే కొంత మంది ప్రేమలో మోసపోతారు.
అప్పుడు కలిగే వేదన నుంచి తమని తాము మళ్ళీ ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు.సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరికి జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి.
ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ, భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబుకి జోడీగా నటించిన కైరా అద్వానీ కూడా ప్రేమలో ఓడిపోయానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.కాలేజీ రోజుల్లో ఒక అబ్బాయిని ప్రేమించి అతని కోసం ఇంట్లో తల్లిదండ్రులకి అబద్ధం కూడా చెప్పి కలవడానికి వెళ్లేదాన్ని అని చెప్పింది.
అయితే తరువాత కెరియర్, ప్రేమ అనే ప్రశ్న వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ప్రేమని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.ఓ విధంగా చెప్పాలంటే ప్రేమని త్యాగం చేశానని, ఆ సమయంలో మానసికంగా చాలా సంఘర్షణకి గురయ్యానని పేర్కొంది.
తరువాత మరల జీవితంలో నేను ఎంచుకున్న ప్రయాణం వైపు అడుగులు వేశానని చెప్పింది.
.