ఆచార్య కోసం మహేష్‌ అంటూ మళ్లీ వార్తలు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ దాదాపు ఏడు నెలల తర్వాత ప్రారంభమైనట్లు సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.తక్కువ మంది నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను సారథ్యంలో సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో దర్శకుడు కొరటాల శివ ప్రారంభించాడు.

 Mahesh Babu Voice Over To Acharya Movie , Mega Star Chiranjeevi, Acharya Movie,-TeluguStop.com

జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే ఉద్దేశంతో కొరటాల శివ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మొదట పాత్రకు గానూ మహేష్ బాబు తో సంప్రదింపులు జరిపాడు.మహేష్ బాబు ఓకే అన్నప్పటికీ పారితోషికం విషయంలో ఒప్పందం కుదరలేదన్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఆచార్యకు మహేష్ బాబు కు ఎలాంటి సంబంధం లేదని భావిస్తున్న తరుణంలో మళ్లీ కొత్త వార్తలు పుట్టుకు వస్తున్నాయి.

దర్శకుడు కొరటాల శివకు మహేష్ బాబుకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఆ కారణంగానే ఆచార్య సినిమా కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.మహేష్ బాబుతో వాయిస్ ఓవర్‌ ఇప్పించడం వల్ల సినిమా క్రేజ్‌ అమాంతం పెరిగే అవకాశం ఉంది.

క్రేజ్‌ పెంచడం వల్ల ఆచార్య సినిమా బిజినెస్ మరింతగా పెరిగే అవకాశం ఉందని కొరటాల శివ భావిస్తున్నాడు.సినిమాకు భారీగా పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో ఇలాంటివి కల్పిస్తే మంచి బిజినెస్ అవుతుందని ఆలోచించి మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇస్తే ఖచ్చితంగా సినిమా క్రేజ్‌ అమాంతం పెరిగే అవకాశం ఉంది.చిరంజీవి, రామ్‌ చరణ్‌లు నటించడంతో పాటు మహేష్‌ బాబు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడంతో సినిమా ఓపెనింగ్స్‌ ను ఊహించుకోవడానికే బాబోయ్‌ అన్నట్లుగా ఉంది.

సినిమా యావరేజ్‌ అని టాక్‌ వచ్చినా ఈజీగా 200 కోట్లు వసూళ్లు సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube