హత్రాస్ ఘటన నేపథ్యంలో యోగి పై నిప్పులు చెరిగిన మాయావతి

ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో చోటుచేసుకున్న పాశవిక ఘటన నేపథ్యంలో సీఎం యోగి పై బీఎస్పీ అధినేత్రి మాయావతి నిప్పులు చెరిగినట్లు తెలుస్తుంది.రాష్ట్రంలో ఇంతగా దారుణాలు చోటుచేసుకుంటున్నప్పటికీ ఆయన శాంతి భద్రతలను నెరపడం లో విఫలమయ్యారు అంటూ ఆమె మండిపడ్డారు.

 Cm Yogi Adityanath Should Resign If He Can't Ensure Safety To Women, Says Mayawa-TeluguStop.com

అంతేకాకుండా యోగిని తిరిగి గోరఖ్ మఠ్ కు పంపించాలని మాయావతి ఎద్దేవా చేశారు.అదీ నచ్చకపోతే.

రామ మందిర నిర్మాణ పనులను అప్పజెప్పాలని పేర్కొన్నారు.మహిళలపై నేరాలు జరగకుండా యూపీలో రోజు కూడా గడవదని మండిపడ్డారు.

మహిళలకు భద్రత కల్పించే విషయంలో యోగి విఫలమైతే వెంటనే ఆయన రాజీనామా చేసి తిరిగి మఠానికి పంపించేయండి అంటూ ఆమె డిమాండ్ చేశారు.ఇటీవల యూపీ లో చోటుచేసుకున్న హత్రాస్ ఘటన నిర్భయ ఘటనను తలపించేలా జరిగింది.19 ఏళ్ల యువతి ని అత్యంత పాశవికంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆ యువతి నాలుక కోసి నానా చిత్ర హింసలకు గురి చేశారు.ఇంత దారుణం చోటుచేసుకున్నప్పటికీ రాష్ట్రంలో ఇలాంటి అత్యాచారాలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి అని మాయావతి మండిపడ్డారు.

హత్రాస్ ఘటన తర్వాత అయినా, మహిళలపై నేరాలు తగ్గుతాయని తాము బావించామని, కానీ అదే రాష్ట్రంలో బలరాంపూర్‌లో కూడా మరో ఘటన చోటుచేసుకుంది అని, ఆయన మహిళలకు భద్రత కల్పించడం లో విఫలమౌతున్నారని ఆయనను తిరిగి మఠానికి పంపించేయండి అంటూ ఆమె ధ్వజమెత్తారు.అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వంలో నేరస్థులకు ఫ్రీహ్యాండ్ దొరికిందని మాయవతి ఈ సందర్భంగా మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube