రౌడీ చిలుకలు... మాట్లాడితే బూతులు...!

ఎవరైనా ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే వారిని చిలకపలుకులు మాట్లాడుతున్నావు అంటూ ఉంటాం.చాలామంది ఇళ్లల్లో చిలుకలను పెంచుకోవడం కామన్.

 African Parrots Removed From Zoo Display For Rude Language, African Parrots, Zoo-TeluguStop.com

అలా పెంచుకున్న చిలకలకు ముద్దు ముద్దు మాటలు నేర్పుతూ అవి పలికినప్పుడు తెగ ఆనంద పడిపోతుంటారు ప్రజలు.ఇక ఆ విషయం పక్కన పెడితే తాజాగా కొన్ని చిలుకలు మాత్రం బూతులతో మనుషుల చెవులు మూసుకునేలా చేస్తున్నాయి.

మాములుగా ఎవరైనా మనుషులు చిలకలకు మంచి మాటలు నేర్పిస్తారు.కాకపోతే ఈ చిలుకలకు మాత్రం ఎవరో బూతులు నేర్పించారు.

మాట్లాడితే చెవులు మూసుకోక తప్పదు.అక్కడి నుంచి పారిపోవడం తప్ప వేరే మార్గం లేకుండా పోతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

గత నెలలో ఓ జూ కి ఐదు ఆఫ్రికన్ చిలుకలను తీసుకువచ్చారు.అయితే ఆ చిలకల అన్నిటిని కూడా ఒకే గదిలో బంధించారు.

అయితే ఆ ఆఫ్రికన్ చిలుకలకు బూతులు ఎవరు నేర్పించారో తెలియదు కానీ, సందర్శకులు వచ్చినప్పుడు మాత్రం అవి వారిపై అమ్మనా బూతులు తిట్టేసాయి.కేవలం ఆ బూతులు సందర్శకులను మాత్రమే కాకుండా అక్కడ ఉన్న కేర్ టేకర్స్ ను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వారిని కూడా బండ బూతులు తిట్టేస్తున్నాయి.

ఇలా తిట్టే సమయంలో మొదట్లో వాటి తిట్లు చాలా బాగున్నాయి అని కొందరు అనగా వాటిని డిస్ప్లే లోకి మార్చారు.

ఇక ఎప్పుడైతే డిస్ప్లే లోకి వచ్చిన చిలుకలు వాటిని చూడడానికి వచ్చిన సందర్శకుల్ని ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టడం మొదలు పెట్టాయి.

దీనితో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్శకులు వెంటనే ఆ జూ యాజమాన్యానికి కంప్లైంట్ చేశారు.దీంతో ఆ చిలుకలను జూ వ్యక్తులు డిస్ప్లే నుండి తొలగించారు.

ఇందుకు సంబంధించి సదరు జూ సీఈఓ స్టీవ్ నికోలస్ మాట్లాడుతూ అందులోని ఓ చిలుకకు బూతులు వచ్చి ఉంటాయని, వాటన్నింటిని కలిపి ఒకే గదిలో ఉంచడం వల్ల మిగతా చిలుకలు కూడా ఆ బూతు పదాలు నేర్చుకొని ఉంటాయని చెప్పుకొచ్చాడు.అంతే కాకుండా మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube