వేధింపులు భరించలేక ఓ మహిళా ఎస్ఐ ఆత్మహత్యకు యత్నించింది.జిల్లా స్థాయి ఉన్నతాధికారి వేధింపులు ఎక్కువ అవడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.
నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది.దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని విచారణ నిర్వహించారు.
పెదకూరపాడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారిణి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించగా ప్రమాదం తృటిలో తప్పింది.మద్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సూపరింటెండెంట్ కె.బాలకృష్ణన్ వేధింపులకు పాల్పడటం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ మహిళా ఎస్ఐ పేర్కొంది.విచారణ చేపట్టిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు బాలకృష్ణన్ ను సస్పెండ్ చేశారు.
ఈ మేరకు గుంటూరు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపారు.గతంలో బాలకృష్ణన్ సిబ్బందిపై వేధింపులకు పాల్పడినట్లు, ఈ క్రమంలో మహిళా ఎస్ఐపై వేధించడంతో ఆత్మహత్యకు యత్నించిందని విచారణలో తేలింది.
దీంతో బాలకృష్ణన్ ను విధుల నుంచి బహిష్కరించారు.మహిళలపై వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.మహిళలు కూడా తమ పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, ఆత్మహత్య పాల్పడితే నిందితులకు శిక్ష ఎలా పడుతుందన్నారు.