ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోనీ సాధించిన ఘనతలు మరెవ్వరు సాధించలేదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.మూడు ఫార్మట్‌లలో ప్రపంచ ఛాంపియన్ గా జట్టును నిలిపిన సారధిగా ధోని ఘనత సాధించాడు.
అలాంటి ధోని తన రిటైర్మెంట్‌ను ఇటీవల ప్రకటించాడు.ఇప్పటి వరకు ఎంతో మంది గొప్ప ఆటగాళ్ల రిటైర్మెంట్ మ్యాచ్‌ల్లో చూశాం.
కాని ధోనీ మాత్రం ప్రస్తుతం సిరీస్‌లు ఏమీ లేని సమయంలో తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు.ధోనీకి ఇలాంటి రిటైర్మెంట్ ఏమాత్రం సరికాదంటూ ఎంతో మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీసీసీఐ కూడా ధోనీకి గౌరవ ప్రధమైన వీడ్కోలును ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ధోనీ కోసం ఐపీఎల్ తర్వాత ఒక ఫేర్‌వెల్ మ్యాచ్‌ను నిర్వహించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.
దాని గురించి ధోనీతో చర్చించాల్సి ఉందని అన్నారు.ధోనీ ఇండియాకు అందించిన విజయాలను బీసీసీఐ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఫేర్‌వెల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
మ్యాచ్ గురించి ఐపీఎల్ సమయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.అయితే ఈ మ్యాచ్ ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుత కరోనా సమయంలో అభిమానుల మధ్య మ్యాచ్ అంటే సాధ్యం కాదు.కనుక ధోనీ ఫేర్‌వెల్ మ్యాచ్ విషయంలో అభిమానులకు పలు అనుమానాలు ఉన్నాయి.