కన్నీళ్లు తుడుచుకో చెల్లి.. సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్!

మన టాలీవుడ్ సినిమాల్లో హీరోలు ప్రజలకు ఎన్నో నీతి పాఠాలు చెప్తుంటారు.కానీ నిజ జీవితంలో ఆ హీరోయిజం చూపించమంటే మాత్రం కేవలం 10 లేదా 20 శాతం మంది మాత్రమే చిన్న సాయం చేసి పెద్ద ప్రచారం చేసుకుంటారు.

 Sonusood Emotional Post Says Wipe Off Your Tears Sister, Sonu Sood, Flood Hit Gi-TeluguStop.com

కానీ తెలుగు సినిమాల్లో విలన్ గా నటించిన సోనూ సూద్ మాత్రం కరోనా కష్టకాలంలో కోటిమందికి కాకపోయినా అవసరం కష్టాలు ఉన్నాయ్ అన్న అందరికి సాయం అందించాడు.

నిన్నటికి నిన్న 39 మంది చిన్నారులకు సాయం చేసిన సోనూ సూద్ ఇప్పుడు మరోసారి కరిగిపోయారు.

వర్షాల కారణంగా ఇళ్లు, పుస్తకాలు కోల్పోయిన బాలికకు నేను ఉన్నాను అంటూ నిలిచారు.గత కొద్దీ రోజుల నుంచి ఛత్తీస్‌ఘడ్‌లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వర్షాల కారణంగా బిజాపూర్‌, బస్తర్‌లోని అంజలి‌ అనే బాలిక ఇళ్లు కూలిపోయింది.

దీంతో ఇంట్లోని వస్తువులు, అమ్మాయి పుస్తకాలు అన్ని పాడయ్యాయి.

దీంతో బాలిక కన్నీరు మున్నీరుగా విలపించింది.ఇది అంత వీడియో తీసి జర్నలిస్ట్‌ ముఖేష్‌ చంద్రకర్‌ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అయితే ఈ వీడియో అటు ఇటు ట్రెండ్ అవుతూ సోనూ సూద్ దృష్టికి వెచ్చింది.

దీనిపై స్పందించిన సోనూ సూద్ ”కన్నీళ్లు తుడుచుకో చెల్లమ్మ.

ఇళ్లు కొత్తదవుతుంది.పుస్తకాలు కూడా కొత్తవవుతాయి” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

ఈ వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి భూపేశ్‌ భగెల్‌ సైతం బాలిక కుటుంబానికి సహాయం చేయవల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube