వారి దెబ్బకు బాలయ్య పాత్రను లేపేసిన బోయపాటి

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను గతకొంత కాలంగా ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేస్తూ వచ్చింది.ఈ దర్శకుడు ఎంచుకున్న కథలు రొటీన్ అయినా, ఆయన చూపించే విధానం కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు బోయపాటి సినిమా అంటే ఇష్టపడేవారు.

 Boyapati Srinu, Balakrishna, Nbk107, Aghora-TeluguStop.com

కానీ రొటీన్ చిత్రాలను మరింత రొటీన్‌గా చూపిస్తుండటంతో ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మిగిలాయి.

ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణతో కలిసి మూడోసారి సినిమా చేసేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టిన ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో నటిస్తున్నాడు.దీని కోసం ఏకంగా గుండుకూడా చేయించుకున్నాడు.అయితే సెకండాఫ్‌లో వచ్చే ఈ పాత్రకు డైలాగులు ఉండవని తెలుస్తోంది.

కాగా బాలయ్య అంటేనే డైలాగులు, అలాంటిది బాలయ్య డైలాగులు లేకుండా ఉంటే ఎలా అని బాలయ్య ఫ్యాన్స్ బోయపాటిపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.దీంతో బోయపాటి అఘోరాకు సంబంధించిన కొన్ని సీన్స్ లేపేసి, రెండో పాత్ర నిడివిని పెంచాడని చిత్రపురిలో టాక్.

మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube