ఏపీలో జగన్ మార్క్ పరిపాలన ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా చూపిస్తున్నాడు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్.ప్రజా సంక్షేమం కోసమే వైసీపీ ప్రభుత్వం పని చేస్తుంది అని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు జగన్.
అందుకే ఆర్థికంగా భారమైన ఎన్నో సంక్షేమ పథకాలను ఇప్పటికే అమలులోకి తీసుకు వచ్చాడు.ఇంకా అనేక ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాడు.
అయితే ఈ పథకాలన్నిటికీ బడ్జెట్ సరిపోదు అనే విషయం అందరికీ బాగా తెలుసు.ఈ విషయంలో జగన్ కు కూడా క్లారిటీ ఉంది.
అయినా మొండి పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు.ఎన్నికల ముందు వరకు బిజెపి మద్దతు తమకు ఉండడంతో కేంద్రం లో బిజెపి అధికారంలోకి వస్తుందన్న ధీమాతో జగన్ ఆర్థికంగా భారమైన ఎన్నో పథకాలను ప్రకటించేశారు.
అధికారంలోకి వచ్చాక కేంద్రంలో ఎలాగూ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అనే ధీమా జగన్ లో బాగా కనిపించింది.
అప్పుడు తాను ప్రవేశపెట్టిన పథకాలకు ఆర్థికంగా అండ దండలు కేంద్రం అందిస్తుంది అని జగన్ ముందుగా భావించారు.కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బిజెపి క్రమక్రమంగా వైసీపీకి దూరంగా జరిగింది.ఇప్పటికీ డైరెక్టుగా వైసీపీతో విరోధం పెట్టుకోకపోయినా శత్రుత్వం కొనసాగిస్తూ వస్తోంది.
అయినా జగన్ బీజేపీతో సన్నిహితంగా మెలిగెందుకు ప్రయత్నిస్తున్నాడు.బిజెపి కూడా ఏపీలో బలపడేందుకు టిడిపిని బలహీనం చేయడంతోపాటు వైసీపీ మీద కూడా ఓ కన్నేసి ఉంచింది.
ప్రస్తుతం జగన్ ఆలోచనంతా బీజేపీతో సన్నిహితంగా మెలగడం.అందుకోసం ఆ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తరచుగా ఢిల్లీ వెళుతూ కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో జగన్ ఉన్నాడు.
ప్రస్తుతం పార్లమెంటులో సంఖ్యాపరంగా చూసుకుంటే జగన్ పార్టీ కేంద్రంలో మూడో స్థానంలో ఉంది.ప్రస్తుతం బీజేపీకి ఒక్కో పార్టీ దూరమవుతున్న క్రమంలో జగన్ బీజేపీకి సన్నిహితంగా ఉండాలని జగన్ ప్రయత్నిస్తున్నాడు.బీజేపీ కూడా వైసిపి సపోర్ట్ తీసుకోవాలని భావనలో ఉన్నట్టుగా జగన్ కు సమాచారం అందింది.ఈ నేపథ్యంలోనే కేంద్రంలో బిజెపి చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో తాము కూడా చేరాలని జగన్ భావిస్తున్నారు.
ఈ మేరకు రెండు కేంద్ర మంత్రి పదవులు తీసుకుని బీజేపీకి బహిరంగంగా మద్దతు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.ఆ రెండు మంత్రి పదవుల్లో ఒకటి వైసిపి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి కి, రెండో పదవి జగన్ కు అత్యంత సన్నిహితుడైన మచిలీపట్నానికి చెందిన బాలశౌరి కి పదవులు వచ్చేలా చేయాలని జగన్ చూస్తున్నాడు.