‘జిల్‌’లో చేరిన బ్రహ్మీ

గోపీచంద్‌, రాశి ఖన్నా జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జిల్‌’ మూవీకి మిశ్రమ స్పందన వస్తోంది.గోపీచంద్‌ గత చిత్రంతో పోల్చితే ఈ సినిమాలో కామెడీ శాతం తగ్గిందని, దాంతో ప్రేక్షకుల ఆధరణ తగ్గిందంటూ వార్తలు వస్తున్నాయి.

 Brahmi Comedy Scence Added Into Jil Movie-TeluguStop.com

ప్రేక్షకుల నుండి వస్తున్న టాక్‌ను గమనించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమాకు బ్రహ్మీ కామెడీ ట్రాక్‌ను యాడ్‌ చేయాలని నిర్ణయించారు.షూటింగ్‌ సమయంలోనే బ్రహ్మానందంతో సపరేట్‌గా కామెడీ ట్రాక్‌ను చిత్రీకరించడం జరిగింది.

అయితే లెంగ్త్‌ ఎక్కువగా ఉందనే కారణంతో, ఎడిటింగ్‌లో తీసేయడం జరిగిందట.

ఎడిటింగ్‌ సమయంలో తీసేసిన బ్రహ్మానందం కామెడీ సీన్స్‌ను తాజాగా రీ ఎడిట్‌ చేసి సినిమాలో పెట్టేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు సిద్దం అయ్యారు.

నేడో రేపో బ్రహ్మీ ‘జిల్‌’లో నవ్వులు పూయించనున్నాడు.బ్రహ్మానందం కామెడీతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి తప్పకుండా పాజిటివ్‌ టాక్‌ వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరి చిత్ర యూనిట్‌ సభ్యులు చేసిన ఈ ప్రయత్నం ఏమేరకు సఫలం అవుతుందో చూడాలి.‘మిర్చి’ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మించిన ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించాడు.

గోపీచంద్‌ ఈ సినిమాలో స్టైలిష్‌ లుక్‌లో కనిపించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube