పౌషికాహారం పేరుతో పురుగులు పడ్డ ఆహారం

అంగన్వాడీ కేంద్రంలో నిర్వాహకుల నిర్వహకం.పురుగులు పట్టిన పప్పుతో పిల్లలకు ఆహారం.

తల్లీ,పిల్లల,ప్రాణాలతో చెలగాటం.

ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూల్ కు తాళం వేసిన తల్లిదండ్రులు.

సూర్యాపేట జిల్లా:పుట్టిన ప్రతీ 0 నుండి 5 ఏళ్ల బిడ్డకు సరైన పోషకాహారం అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బాలికా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లను ప్రతి మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసి,గర్భిణీ స్త్రీలకు, పసిబిడ్డలకు,బాలింతలకు పౌష్టికాహారం సరఫరా చేస్తుంది.కొంతమంది శిశు సంక్షేమ శాఖ అధికారుల అలత్వమో,అవినీతో,అంగన్వాడీ నిర్వహకుల చేతి వాటమో తెలియదు కానీ,పౌష్టికాహారం పక్కదారి పట్టి,పురుగులు పట్టిన కంది పప్పు,క్వాలిటీ లేని కారం పొడి,కాలం చెల్లిన కోడి గుడ్డు పసి పిల్లలు పౌష్టికాహారంగా మారుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.

ఇలాంటి ఘటనే సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న టేకుమట్ల గ్రామంలో వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో మొత్తం మూడు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి.

Advertisement

బుధవారం రెండవ అంగన్వాడీ కేంద్రం నిర్వహకులు పురుగులు పట్టిన కంది పప్పు,తెల్లగా పాలిపోయిన కారంపొడితో పిల్లలకు భోజనాన్ని ఏర్పాటు చేశారు.ఈ విషయాన్ని గమనించిన పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహంతో నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.

వారి నుండి నిర్లక్ష్య సమాధానం రావడంతో అంగన్వాడీ సెంటర్ కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సంఘటనపై సంబంధిత శాఖా అధికారులు తక్షణమే స్పందించి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న టేకుమట్ల అంగన్వాడీ-2 సెంటర్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Latest Suryapet News