చామలను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

నల్లగొండ జిల్లా:భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని( Chamala Kiran Kumar Reddy ) అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి, మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గడచిన పది సంవత్సరాలలో అబద్ధాలతో,మోసపూరిత మాటలతో మోసం చేసిన బీఆర్ఎస్,బీజేపీ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీలో ఐదు గ్యారంటీలు అమలు చేసిందని,పాంచ్ న్యాయ్ ద్వారా రైతులకు,మహిళలకు, యువకులకు,శ్రామికులకు సమగ్రన్యాయం అందుతుందని తెలిపారు.రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలంటే చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరారు.

Win The Chamas With A Huge Majority , Chamala Kiran Kumar Reddy, Ravinder Reddy,

ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి,కత్తి రవీందర్ రెడ్డి,పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, రాజు,శివారెడ్డి,ఏవిరెడ్డి,పూల వెంకటయ్య,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మూసికి పూడిక ముప్పు
Advertisement

Latest Nalgonda News