హుజూర్ నగర్ రవాణా వ్యవస్థపై ఆర్టీసీ శీతకన్ను ఎందుకు..?

సూర్యాపేట జిల్లా:సిమెంట్ కర్మాగారాలకు కేంద్రంగా ఉంటూ దినదినాభివృద్ధి చెందుతున్న హుజూర్ నగర్ పట్టణం నుండి హైదారాబాద్,సూర్యాపేట వంటి పట్టణాలకు వెళ్ళడానికి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు నిత్యం పడిగాపులు కాస్తున్నారని, రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలో ఇలాంటి పరిస్థితి ఉండడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు వివిధ అవసరాల దృష్ట్యా నిత్యం ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే అవస్థలు పడుతున్నారని, బయటికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరాలంటే చుక్కలు చూస్తున్నారని,ఇప్పటికైనా మంత్రి ఉత్తమ్ చొరవ తీసుకుని ఇక్కడి నుండి నేరుగా హైదారాబాద్, సూర్యాపేటకు ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Why Is RTC Freezing The Huzurnagar Transport System?, RTC Freezing , Suryapet Di

Latest Suryapet News