భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనవి?

దేవుడికి మనం పూజ చేసేటప్పుడు ఈ పూలు వాడొచ్చా లేదా ఏ పూలు వాడితే మంచిదని చాలా ఆలోచిస్తాం. కానీ ఎక్కువగా అందుబాటులో ఉన్న పూలను మాత్రమే పూజకు ఉపయోగిస్తాం.

 Which Flowers Is Good To Puja, Pooja , Flowers ,temple , Devotinal, Parameswara,-TeluguStop.com

 మనం చేసే పూజకు ప్రతిఫలం దక్కాలంటే ఖచ్చితంగా నియమాలను పాటించాలి.వాడాల్సిన పూలను మాత్రమే వాడిలి.

మనం ఏ దేవుడికైతే పూజ చేస్తున్నామో ఆ దేవుడికి ఇష్టమైన పూలు వాడటం మరింత మంచిది.దేవుడిని ఎంత సంతృప్తి పరిస్తే మనకు అంత మంచి జరుగుతుంది.

అందుకే ఏయే దేవుడుకి ఏ పూలు వాడితో మంచిదో ముందే తెలుసుకుందాం.అలాగే ఏ పూలు వాడకూడదో కూడా తెలుసుకుందాం.

ఏ దేవుడికి ఏ పూలు ఇష్టం?

పరమేశ్వరుని పూజలకు జిల్లేడూ, గన్నేరూ, మారేడూ, తమ్మి, ఉత్తరేణు ఆకులూ, జమ్మి ఆకులూ, జమ్మి పూలూ, నల్లకలువలు చాలా మంచివని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.దాసాని, మంకెన, నదంత, మొగలి, మాలతి, కుంకుమ మద్ది… ఈ పూలు పూజకు పనికి రావు, తొడిమలేని పువ్వులు పూజకు అస్సలే పనికిరావట.

 తమ్మి పువ్వుకు మాత్రం పట్టింపు లేదు. మారేడు నందు శ్రీ మహా లక్ష్మీ, నల్ల కలువ నందు పార్వతి, తెల్ల కలువ నందు కుమార స్వామీ, కమలము నందు పరమేశ్వరుడూ కొలువై ఉంటారు.

 అలాగే చదువుల తల్లి సరస్వతీ దేవి తెల్ల జిల్లేడులో, బ్రహ్మ కొండ వాగులో, కరవీరపుష్పంలో గణపతీ, శివమల్లిలో శ్రీ మహా విష్ణువు, సుగంధ పుష్పాల్లో గౌరీదేవి ఉంటారు.

Telugu Devotinal, Devotional, Flowers, Kaluva Puvuulu, Parameswara, Pujalu, Temp

ఏ దేవుడికి ఏయే పూలు వాడొద్దు?

అలాగే శ్రీ మహా విష్ణువుని అక్షింతలతోనూ, మహా గణపతిని తులసితోనూ, తమాల వృక్ష పుష్పాలతో సరస్వతీ దేవిని, మల్లె పూలతో భైరవుడిని, తమ్మి పూలతో మహాలక్ష్మీని, మొగలి పువ్వులతో శివుడ్నీ, మారేడు దళాలతో సూర్య భగవానుడిని ఎట్టి స్థితిలోనూ పూజింపరాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube