చ‌లి కాలం వ‌చ్చేసింది.. మ‌రి ఇవి తింటున్నారా?

చ‌లి కాలం రానే వ‌చ్చేసింది.వెన్నులో వణుకు పుట్టించే ఈ చ‌లికి ఎంత‌టి బ‌ల‌వంతుడైనా, ధ‌న‌వంతుడైనా వ‌ణ‌కాల్సిందే.

 What We Eat Best Food In Winter Season! Best Food, Winter Season, Latest News, H-TeluguStop.com

ఇక ఈ చ‌లి కాలంలో వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.అందుకే ఈ కాలంలో అనేక‌ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా డైట్‌లో కొన్ని ఆహార ప‌దార్థాల‌ను ఖ‌చ్చితంగా చేర్చుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మ‌రి ఆ ఆహార ప‌దార్థాలు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చ‌లి కాలంలో ప్ర‌తి రోజు నాన బెట్టిన బాదం ప‌ప్పును ఎనిమిది నుంచి ప‌ది వ‌ర‌కు తీసుకోవాలి.బాదం ప‌ప్పులో పుష్క‌లంగా ఉండే విట‌మిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌ని చేసి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంది.

త‌ద్వారా అనేక వైర‌స్‌లు, జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.మ‌రియు బాదం తీసుకోవ‌డం వ‌ల్ల‌ శ‌రీరంలో కొవ్వు త‌గ్గి.బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ‌ప‌డుతుంది.
అలాగే ఈ కాలంలో వేరుశెనగల‌ను బెల్లంతో క‌లిపి తీసుకుంటే.

ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఈ రెండు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడిని క్రమబద్ధం చేసి.

చ‌లిని త‌ట్టుకునే శ‌క్తిని అందిస్తుంది.ఒకవేళ బెల్లంతో కాక‌పోయినా.

వేరుశెన‌గ‌ల‌ను ఉడ‌క‌బెట్టి లేదా వేయించి కూడా తీసుకోవ‌చ్చు.ఖర్జూరాలను కూడా డైట్‌లో చేర్చుకోవాలి.

వీటితో బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌డంతో పాటు ఒంట్లో వేడి పెంచి.చ‌లి నుంచి ర‌క్షిస్తుంది.

ఇక ఈ చ‌లి కాలంలో చాలా మంది డీహైడ్రేషన్‌కు గుర‌వుతుంటారు.ఈ డీహైడ్రేష‌న్‌కు చెక్ పెట్టాలంటే.నాలుగు లేదా ఐదు క‌ప్పుల హెర్బల్ టీ లాంటి వేడి ద్రవాలను తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే సజ్జలు, రాగులు, జొన్న‌లు వంటివీ డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ పెంచి.

రోగాల నుంచి ర‌క్షిస్తుంది.వీటితో పాటు సీతాఫలం, యాపిల్‌, కివి పండ్లు, అవకాడో, క‌మ‌లా, అర‌టి పండు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube