తెలంగాణ బిజెపిలో అయోమయం నెలకొంది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి రావాలని భావిస్తున్న బిజెపికి సొంత పార్టీలోని పరిణామాలు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు.
బీఆర్ఎస్ లోని కీలక నాయకులంతా ఒకే విషయంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుండడం వంటివి ఇబ్బందికరంగా మారాయి.ప్రస్తుతం తెలంగాణలో బిజెపిలో నేలకొన్న ఈ ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ కాచుకు కూర్చుంది.
ఇప్పటికే బీజేపీలో కీలకంగా ఉన్న చేరికలు కమిటీ చైర్మన్ ,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి రావాలంటూ రేవంత్ ఆహ్వానాలు పంపుతున్నారు.
కేసీఆర్ ను అధికారానికి దూరం చేయాలంటే బిజెపిలో ఉంటే అది సాధ్యం కాదని, కాంగ్రెస్ వైపు రావాలంటూ రేవంత్ ఆహ్వానాలు పంపుతున్నారు.ఇక కొద్ది రోజుల క్రితమే పార్టీలో కోవర్ట్ లు ఉన్నారంటూ ఈటెల రాజేందర్ బహిరంగంగా వ్యాఖ్యానించి సంచలనం రేపారు.కోవర్ట్ ల విషయంలో ఈటెల ఈ విధంగా స్పందిస్తే .బిజెపి ఎంపీ లక్ష్మణ్ మాత్రం కేసిఆర్ కోవర్ట్ లు బిజెపిలో ఉండి చేసేదేమీ లేదని, సరైన సమయంలో తమ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని , తాము చేరికలపై ఆధారపడమని, తెలంగాణపై ప్రధాన మోది, అమిత్ షాలకు ప్రత్యేక వ్యూహం ఉందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విషయానికి వస్తే .ఆయన మరో విధంగా స్పందిస్తున్నారు.అసలు తమ పార్టీలో కోవర్ట్ లే లేరు అని, కోవర్టులు ఉన్నారని ఈటల రాజేందర్ చెప్పినట్టుగా కొన్ని చానళ్లు ఆయన వ్యాఖ్యలను వక్రీకరించాయని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో బీ ఆర్ ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్నట్టు కనిపించినా, బిజెపి ఇప్పుడు మాత్రం సొంత పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, సొంత పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం లేకుండా ఎవరికి వారు తోచిన విధంగా మాట్లాడుతుండడం వంటివి ఆ పార్టీలో ఉన్న గందరగోళాన్ని తెలియజేస్తున్నాయి.ఇక బిజెపిలో కీలకంగా ఉన్న మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ తో పాటు, కొండ విశ్వేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ వైపు తీసుకువచ్చేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ తరహా వ్యవహారాలన్నీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు తీవ్ర అసంతృప్తిని కలుగజేస్తున్నాయి.