డ్యూటీకి వెళ్లి సాగర్ కాలువలో శవమై తేలాడు

నల్లగొండ జిల్లా: గురువారం ఉదయం డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి సాగర్ ఎడమ కాలువలో శవమై తేలిన సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda)మండలంలో వెలుగులోకి వచ్చింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.

తక్కేళ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని బండమీద గూడెంనారబోయిన హరికృష్ణ(Naraboina Harikrishna) (32)గురువారం పెద్దదేవులపల్లిలోని రెడ్డీస్ ఫ్యాక్టరీ(Reddys Factory)లో డ్యూటీకి వెళ్ళాడు.సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా వేములపల్లి సమీపంలో బిడ్జ్ సాగర్ కాల్వకట్టలపై బైకు, చెప్పులు లభ్యమయ్యాయి.

Went To Duty And Floated Dead In Sagar Canal, Sagar Canal, Miryalaguda, Bandamid

అనుమానంతో సాగర్ కాలువలో వెతకగా సూర్యాపేట జిల్లా మేడారం వద్ద శుక్రవారం ఉదయం మృతదేహం లభించింది.హరికృష్ణ అత్తగారి ఊరు పెద్దదేవులపల్లి కావడం,ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరగటంతో హరికృష్ణ మృతిపై అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?
Advertisement

Latest Nalgonda News