నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీకి నీరు విడుదల

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాల్వకు నీరు విడుదల అయింది.ఈ మేరకు రెండు వేల క్యూసెక్కుల నీటిని ఏపీ అధికారులు విడుదల చేశారు.

 Water Release From Nagarjunasagar Project To Ap-TeluguStop.com

ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో అధికారులు గేట్లను ఎత్తారు.అయితే బలవంతంగా తాత్కాలిక విద్యుత్ తో కుడి కాల్వకు నీటి విడుదల చేసినట్లు తెలుస్తోంది.

మొత్తం 26 గేట్లలో 13 గేట్ల వద్ద తెలంగాణ, మరో 13 గేట్ల వద్ద ఏపీ పోలీసులు భారీగా మోహరించారు.ఈ క్రమంలోనే ముళ్లకంచె, టెంట్లు వేసి ఏపీ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత నాగార్జునసాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది.అయితే నదీ జలాలు, విద్యుత్ పంపిణీ విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube