వామ్మో.. చైనాలో మరో వైరస్..!

గత కొద్ది నెలల క్రితం చైనా లో పుట్టి ప్రపంచమంతా వ్యాపించి ఒక్కసారిగా అందరినీ భయబ్రాంతులకు గురి చేసిన కరోనామహమ్మారి నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే మరో పిడుగులాంటివార్తను శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కరోనాకు సంబంధం ఉన్న మరొక వైరస్ మనుషులకు వ్యాప్తి చెంది తీవ్రంగా విజృంభించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 Wammo Another Virus In China-TeluguStop.com

ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఒక్కసారిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.ఎంతో ప్రాణనష్టాన్ని చవిచూసింది.

మరి ఇలాంటి మరొక చేదు వార్తని చెప్పడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

 Wammo Another Virus In China-వామ్మో.. చైనాలో మరో వైరస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పటికే ఈ వైరస్ 2016 సంవత్సరంలో చైనాలో గుర్తించారు.

ఈ వైరస్ ను (SADS_COV) వైరస్ అని పిలుస్తారు.ఈ వైరస్ గబ్బిలాల నుంచి పందులకు వ్యాపించిందని గుర్తించారు.

స్వైన్ అక్యూట్ డయేరియా సిండ్రోమ్ కరోనా వైరస్ అని పిలుస్తారు.ఈ వైరస్ ను మొదటిగా చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ లో గుర్తించారు.

ఈ వైరస్ ని పంది పిల్లలు పీల్చడం ద్వారా వాటిలో తీవ్రమైన విరేచనాలను కలిగాయని గుర్తించారు.అయితే ఈ వైరస్ ప్రధానంగా గబ్బిలాల నుంచి వ్యాపించిందని ప్రాథమిక నిర్ధారణలో తేలింది.

ఈ వైరస్ పందుల నుంచి మానవులకు (sads_cov)వ్యాప్తిచెందుతుంది.ఈ వైరస్ కారణంగా మానవులలో ఊపిరితిత్తులు మరియు ప్రేగులకు వ్యాప్తి చెందే వ్యాధికారక ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడించారు.

అయితే ఇప్పటికి కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో, ఇలాంటి కొత్త రకం వైరస్ మళ్లీ ఎంటర్ అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి నా పరిస్థితి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.వాక్సిన్ కనుగొనే వరకు ఇలాంటి భయంకరమైన మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు పాటించడం ద్వారా కొంతవరకు ఈ వ్యాధులను వ్యాప్తిని అరికట్టవచ్చని ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

#AnotherVirus #SwineAcute #FirstIdentified #FoundTo #China

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు