ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోను స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరి.అయిపోయింది.
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ కు బాగా అడిక్ట్ అయిపోయారు అనే చెప్పాలి.కాస్త సమయం దొరికితే చాలు ఫోన్ చూడడానికి బాగా అలవాటు పడిపోయారు.
అరచేతిలో ఫోన్ ఉంటే చాలు లోకంతో మాకేమి సంబంధం లేదు అన్నట్టు ఉంటారు కొంతమంది.ఆ ఫోన్ చేతిలో పట్టుకుని ఏదో పెద్ద బిజీగా వర్క్ చేస్తున్నట్టు దాని మీద ఏకాగ్రత పెట్టి ఒక్కోసారి ఎటు వెళ్తున్నామో, ఏమి చేస్తున్నామో అనే విషయాలను కూడా మర్చిపోతూ ఉంటాము.
ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది.ఫోన్ చూస్తూ ఒక యువతి చేసిన పని చూస్తే మీరు ఆశ్చర్యపోవడం గ్యారంటీ.
వీడియో ప్రకారం ఒక యువతీ సూపర్ మార్కెట్లో పనిచేస్తూ ఫోన్ చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.అయితే ఫోన్ చేస్తూ ముందు ఏమి ఉందని కూడా పట్టుంచుకోకుండా అలా నడుస్తున్న సమయంలో పక్కనే ఉన్న బాస్కెట్లో కాలు పెట్టి నడవసాగింది.
ఇంకేముంది ఒక్కసారిగా బొక్కా బోర్లా కింద పడిపోయింది.ఇంకా విచిత్రం ఏంటంటే.కింద పడిన తర్వాత కూడా ఆ యువతీ ఫోన్ చూడడడం మానలేదు.అలా ఫోన్ చూస్తూ పడుకునిపోయింది.కొద్ది సేపటికి అటుగా ఒక వ్యక్తి రావడం చూసి వెంటనే లేచి కూర్చుంది.సూపర్ మార్కెట్లో జరిగినా ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్స్ భిన్న రకాలుగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.