Viral Video : వీడియో: యువకుడిని దారుణంగా కరిచేసిన వీధి కుక్క.. ధైర్యంగా కాపాడిన మహిళ..

సాధారణంగా కుక్కలు( Dogs ) చాలా విశ్వాసం చూపిస్తాయి.అయితే వీధిలో బతికే కుక్కలు సరిగా ఆహారం నీళ్లు లేక వాటి మానసిక పరిస్థితి దెబ్బతింటుంది.

 Viral Video Brave Woman Saved Man From Dog Attack-TeluguStop.com

అందువల్ల అవి అకారణంగానే జనాలపై దాడి చేస్తుంటాయి.కొన్ని కుక్కలు స్వతహాగా దూకుడుగా ప్రవర్తిస్తూ అన్యాయంగా అమాయకులను కరిచేస్తుంటాయి.

కొన్నిసార్లు కుక్కలు మనసుల కండ పడితే అది ఊడి వచ్చేంతవరకు వదలవు.తాజాగా ఓ కుక్క కూడా దారిన పోతున్న ఒక యువకుడిని దారుణంగా కరిచేసింది.

అది గమనించిన ఒక మహిళ పరుగు పరుగున వచ్చి ఆ యువకుడుని ధైర్యంగా కాపాడింది.ఈ వీడియో సోషల్ మీడియాలో పాపులర్ కావడంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.’అర్హంత్ షెల్బీ’ అనే వ్యక్తి ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు.తర్వాత, ‘ఘర్ కే కాలేష్’ అనే పేరుగల మరొక వ్యక్తి “బ్రేవ్ లేడీ, ఒక వీధి కుక్క నుంచి యువకుడిని రక్షించింది.

” అనే టైటిల్‌తో దాన్ని రీషేర్ చేశాడు.

ఈ షాకింగ్ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో వీడియో( Viral Video )లో చెప్పలేదు.వీడియో ఓపెన్ చేస్తే ఒక యువకుడు ఒక షాప్‌లో సరుకులు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి బయలుదేరుతుండటం మనం చూడవచ్చు, ఆ సమయంలో సదరు యువకుడు ఓ వీధి కుక్కకు దగ్గరికి వెళుతున్నాడు.ఇది నచ్చక కుక్క అతడిపై దాడి చేస్తుంది.

అతడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ కుక్క కాలును కరిచి గట్టిగా పట్టుకుంది.ఇది చూసిన ఓ మహిళ సహాయం కోసం పరిగెత్తుకు వచ్చింది.

కుక్కను విడిపించడానికి ఆమె చాలా ప్రయత్నించింది.తన చేతితో కుక్కను కొట్టింది.

కుక్క ఆమె చేతిని కూడా కొరికింది, దాంతో ఆమె నొప్పితో అరిచేసింది.ఆమె కుక్క నోటి నుంచి తన చేతిని తీసి యువకుడిని విడిపించింది.

ఆమె ధైర్యానికి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియోకు నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.చాలా మంది దీనిపై కామెంట్లు చేసి ఇతరులతో పంచుకున్నారు.కొంతమంది సదరు మహిళ చాలా ధైర్యవంతురాలు అని, యువకుడు అదృష్టవంతుడు అని కామెంట్లు పెడుతున్నారు.

కుక్కకు దూరంగా వెళ్లి ఉంటే బాగుండేదేమో అని మరికొందరు అన్నారు.కుక్క భయపడి యువకుడి పై దాడి చేసినట్లు ఉంది అని మరికొందరు పేర్కొన్నారు.

నగరాల్లో వీధి కుక్కలు( Street Dogs ) ఎక్కువగా ఉన్నాయని, వాటి వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఓ వ్యక్తి తెలిపారు.మహిళ పురుషుడి తల్లిలా కనిపిస్తుందని, ఆమె మంచి పని చేసిందని మరో వ్యక్తి చెప్పాడు.

మనిషి చాలా దగ్గరగా వచ్చినందుకే కుక్క దాడి చేసిందని, వీధి కుక్కలకు దూరంగా ఉండటమే గుణపాఠమని మరో వ్యక్తి చెప్పాడు.తమకు కుక్కలంటే చాలా ఇష్టమని, అయితే ఇలాంటి కొన్ని దురుసు కుక్కలు వాటిని అసహ్యించుకునేలా చేస్తున్నాయని మరో వ్యక్తి చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube