తెలంగాణలో ఇవాళ్టి నుంచి మరో రెండు గ్యారెంటీలు అమలు కానున్నాయి.రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt )అమలు చేయనుంది.ఈ మేరకు సచివాలయంలో రెండు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రారంభించనున్నారు.
అయితే చేవెళ్లలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi )చేతుల మీదుగా రెండు గ్యారెంటీలను ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది.ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.దీంతో సచివాలయంలోనే రెండు గ్యారెంటీలను ప్రభుత్వం ప్రారంభించనుంది.సాయంత్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.