Bill Gates : వీడియో వైరల్: గల్లీ కుర్రోడి ఛాయ్ దుకాణంలో బిల్ గేట్స్..!

బిల్ గేట్స్( Bill Gates ).ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.90వ దశకంలోని పిల్లలకి మీకు తెలిసిన ఓ బిలీనియర్ పేరు చెప్పండి అంటే అందరూ చెప్పే మొదటి సమాధానం బిల్ గేట్స్ మాత్రమే.అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ప్రపంచంలోని టాప్ టెన్ బిలినియర్స్ లో కొనసాగుతూనే ఉన్నారు.

 Video Viral Bill Gates In Footpath Tea Shop-TeluguStop.com

ఆయన కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాకుండా.పిల్లాంత్రోపిస్ట్ కూడా.

ఇకపోతే తాజాగా ఈయన మన భారతదేశ పర్యటనలో ఉన్నాడు.దీనికి కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) చిన్న కుమారుడి వివాహం సందర్భంగా ఆయన గుజరాత్( Gujarat ) లోని జాంనగర్లో కార్యక్రమం కోసం వచ్చారు.

కాకపోతే బిల్ గేట్స్ కి చాయ్ తాగాలనిపించడంతో ఆయన ఏకంగా ఫుట్ పాత్ పై అమ్ముతున్న టీ దగ్గరికి వెళ్లి అల్లం చాయ్ తాగాడు.

అయితే ఆ చాయ్ వాలా టీ చేసిన విధానాన్ని అతడు చేసే పద్ధతిని ఆయన మెచ్చుకున్నారు.అంతే కాదండి పర్యటనలో భాగంగా ఆయన ఆస్వాదించిన ప్రతిక్షణాన్ని అలాగే తాను తాగిన ఛాయి ముచ్చట్లు సంబంధించి ఓ వీడియో కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు బిల్ గేట్స్.

భారతదేశ ధనికులలో మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ కుమారుడి వివాహం సందర్భంగా మార్చి 1 నుండి మార్చి 3 వరకు ఈ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇలా సరదాగా బయటికి వచ్చి వీధుల్లోని చాయ్ తాగి తన ఫీలింగ్స్ ని వ్యక్తపరిచాడు.ఈ పోస్టులో ఆయన భారతదేశం( India )లో ప్రతిరోజు దొరికే టీ లాంటి ఉత్పత్తులపై ఆయనకున్న అభిమానాన్ని పంచుకోవడంలో భాగంగా.భారత్లో ప్రతి చోట ఓ ప్రత్యేకమైన ఆవిష్కరణను కనుగొచ్చావచ్చని.

, అలాగే సాధారణ కప్పు టీ తయారీలో కూడా ఇలాంటి అద్భుతాలు చేయవచ్చని ఆయన తెలియజేశారు.ఇకపోతే బిల్ గేట్స్ టీ తాగిన వ్యక్తి మరెవరో కాదు సోషల్ మీడియా ద్వారా అందరి మన్ననలు పొందిన డాలి చాయ్ వాలా.

ఇతడు టీ తయారు చేసే విధానం., అలాగే కస్టమర్లను పలకరించే విధానంతో అతడు సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ఫేమస్ అయిన సంగతి మనకు తెలిసిందే.

బిల్ గేట్స్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత డాలి చాయ్ వాలాను నెటిజెన్లు భూమి మీద నీ అంతటి అదృష్టవంతుడు లేరని తెగ పొగిడేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube