అయోధ్యలో శ్రీ రామమందిరం..
ఎన్నో కోట్లమంది హిందువుల కల ఇది.ఇంకా ఈ కలకు ఆగష్టు 5 వ తేదీన శ్రీకారం చుట్టనుంది మోడీ ప్రభుత్వం.ఆగస్టు 5న శ్రీ రామమందిరం నిర్మాణ భూమి పూజ చేయనున్నారు .ప్రధాని నరేంద్ర మోడీనే భూమి పూజ చేయనున్నారు.దీంతో మోడీ కోసం వారణాసిలోని బచ్చేలాల్ అనే నేత కార్మికుడు ప్రత్యేక వస్త్రాన్ని నేశారు.
ఆ వస్త్రంపై ”జై శ్రీ రామ్, అయోధ్య పవిత్ర థామ్” అని ఎంబ్రాయిడరీ చేశారు.
ఆ వస్త్రం ఎంత ప్రత్యేకమైనది.ఎంత అద్భుతం అనేది బచ్చేలాల్ వివరిస్తూ.
మెటిరీయల్, డిజైన్ ఈ వస్త్రం గొప్పతనమని, దీనిపై జైశ్రీమ్, అయోధ్య పవిత్ర థామ్ అని రాసి ఉంటుందని బచ్చేలాల్ తెలిపారు.
అంతేకాదు ఈ వస్త్రంపై శ్రీరాముడి ధనుస్సు కూడా ఉందని.
కాటన్, సిల్క్ దారాలతో ఈ క్లాత్ తయారు చేసినట్టు, ఇంకా వస్త్రం తయారీకి 15 రోజులు పట్టిందని బచ్చేలాల్ తెలిపారు.కాగా ఈ వస్త్రంలో బంగారు, ఎరుపు రంగు వాడినట్టు వస్త్రం పొడవు 72 అంగుళాలు, వెడల్పు 22 అంగుళాలతో తయారు చేసినట్టు తెలిపారు.
కాగా ఈ వస్త్రాన్ని పోలీస్ కమిషనర్ ద్వారా అయోధ్యకు పంపాలని అనుకుంటున్నట్టు అతను తెలిపారు.కాగా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుండటం ఎంతో ఆనందంగా ఉందని, ఈ నిర్మాణంతో వారి వ్యాపారం కూడా బాగా పెరుగుతుందని బచ్చేలాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కాగా అయోధ్య భూమి పూజకు ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తున్న సంగతి విదితమే.