మహానంది పురస్కారం అందుకున్న వంగ

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆపద సమయంలో ఉన్నవారికి 48 సార్లు రక్తదానం చేసిన వ్యక్తికి ఉగాది వేడుక ( Ugadi celebration )సందర్భంగా మహానంది పురస్కారం లభించింది.

ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) పట్టణానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి హైదరాబాదులో ఆదివారం తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు త్యాగరాయ గాన సభలో జాతీయ అవార్డు మహానంది పురస్కారాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రహాసన్, తెలంగాణ సమాచార శాఖ సంయుక్త సంచాలకులు వెంకటరమణ, దైవాజ్ఞ శర్మ చేతుల మీదుగా అందజేశారు.వంగ గిరిధర్ రెడ్డి( Vanga Giridhar Reddy ) గత కొన్నేళ్లుగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు.44సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకు( Chiranjeevi Blood Bank )లో, షిరిడీలో రెండుసార్లు, ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రెండుసార్లు తాను రక్తదానం చేయగా గతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు డిప్యూటీ ఐ కమిషనర్ చేతుల మీదుగా హెల్త్ కార్డును, మెమొంటోను అందుకున్నారు.అవార్డు వేడుకలో తెలుగు వెలుగు సాహితీ వేదిక చైర్మన్ పోలోజు రాజకుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి, రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి పూర్ణచంద్రాచార్యులు, జాతీయ కన్వీనర్ వలబోజు మోహన్ రావు, జాతీయ అధ్యక్షులు రంగిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కు గ్రామస్తులు,పలువురు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

పదవి విరమణ పొందిన అధికారని సన్మానించి జ్ఞాపకం అందజేసిన ఎస్పీ..

Latest Rajanna Sircilla News