సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించే వనపల్లి పల్లాలమ్మ స్వామి ఆలయ విశేషాలివే!

సాధారణంగా ఎంతోమంది వివాహమైన తర్వాత వారికి సంతాన భాగ్యం కలుగకపోవడం వల్ల ఎన్నో రకాల వైద్య చికిత్సలు తీసుకున్నప్పటికీ పిల్లలు కలగకపోతే పలు ఆలయాలను సందర్శించి ఆలయాలలో ముడుపులు కట్టడం పూజలు చేయడం వంటివి చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల పిల్లలు కలుగుతారనే నమ్మకంతో చాలామంది ఇలా పలు ఆలయాలను సందర్శించి సంతానభాగ్యం కోసం స్వామివారిని దర్శించుకుని ముడుపులు చెల్లిస్తారు.

 Vanapalli Pallalamma Swamy Temple Is A Special And Importance, Vanapalli Pallala-TeluguStop.com

ఈ విధంగా సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించే ఆలయాలలో వనపల్లి పల్లాలమ్మ స్వామి ఆలయం ఒకటి.మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయ విశేషాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని వనపల్లి అనే గ్రామంలో పల్లాలమ్మ స్వామివారి ఆలయం ఉంది ఇక్కడ వెలసిన అమ్మవారిని ఈ గ్రామస్తులు కాళికా దేవి అవతారంగా భావించి పూజిస్తారు.ఈ ఆలయంలో అమ్మవారు కాలుపై కాలు వేసుకుని భక్తులకు దర్శనమిస్తారు.

ఇలా అమ్మవారి పాదాల కింద నక్కను తొక్కి ఉండటం విశేషం.స్థలపురాణం ప్రకారం సీతాదేవి వనవాసం చేసిన సమయంలో గౌతమీ నదిలో స్నానం చేసి వనదేవతలను పూజించగా ఆమె ప్రత్యక్షమైన దని అప్పటినుంచి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పూజలు అందుకుంటుందని స్థలపురాణం చెబుతుంది.

సాక్షాత్తు సీతాదేవి ఈ పీఠాన్ని ప్రతిష్టించారని ఆలయ పురాణం చెబుతోంది.నిదర్శనంగా అక్కడ పేరు లేని చెట్టును నాటారని ఇప్పటికీ ఆ చెట్టు అక్కడే ఉందని భక్తులు విశ్వసిస్తారు.

ఇక సంతానం లేనివారు ఈ ఆలయానికి సందర్శించి ముడుపులు కట్టడంవల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ఎంతో మంది దంపతులు ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ముడుపులు చెల్లిస్తారు.ఈ విధంగా సంతానం కలిగిన తర్వాత అమ్మవారికి పసుపు వస్త్రం అలాగే వడిబియ్యం ఒక కొబ్బరి మొక్కలు తీసుకువచ్చి భక్తులు సమర్పిస్తుంటారు.

Vanapalli Pallalamma Swamy Temple Is A Special And Importance, Vanapalli Pallalamma Swamy, Temple, Important, Special - Telugu Important, Temple

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube