ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు( Right to vote )ను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ ఏఆర్ఓ (అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి) వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ పిలుపు నిచ్చారు.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పించేందుకు (స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రా్రాల్ పార్టిసిపేషన్ ) ఆద్వర్యంలో  కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు  వేములవాడ పట్టణంలో *5కేరన్*ను తెలంగాణ చౌక్ నుంచి తిప్పాపూర్,బస్టాండ్ దాకా మంగళవారం  నిర్వహించారు.

ఈ సందర్భంగా వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్( Vemulawada RDO Rajeshwar ) మాట్లాడారు.వోటర్ హెల్ప్ లైన్ యాప్(వి ఎచ్ ఎ ) లో అందుబాటులో ఉన్న సేవలు, ఓటు హక్కు నమోదుకు అర్హత వయసు, ఆన్లైన్, ఆఫ్ లైన్ లో ఓటు హక్కు ఎలా నమోదు చేయాలి, ఫారం నెంబర్ 6 వినియోగం, ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఓటును నమోదు చూసుకోవాలని సూచించారు.

Use The Right To Vote , Vemulawada RDO , Rajeshwar, Rajanna Sirisilla District,

ఓటు హక్కు నమోదులో తరచూ చేసే తప్పులు ఎలా నివారించాలి.తదితర అంశాల ఫై వివరించారు.

  రానున్న లోక్ సభ ఎన్నికల్లో గ్రామాలు, పట్టణాల్లో ఓటు హక్కు వినియోగించు కునేలా విద్యార్థులు అవగాహన కల్పించాలని కోరారు. ఈ 5 కే రన్ లో స్వీప్ నోడల్ అధికారి, అడిషనల్ డీఆర్డీఓ గొట్టే శ్రీనివాస్, జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ అధికారి రాందాస్, వేములవాడ నియోజక వర్గంలోని వివిధ మండలాల తహసీల్దార్లు, పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు తదితరులు ఉన్నారు.

Advertisement
గంజినీళ్ళు తాగడం వలన కలిగే లాభాలు

Latest Rajanna Sircilla News