అమెరికా : 2021 ఏడాదిలో బిడెన్, కమలా హారీస్ ఎంత సంపాదించారో తెలుసా...!!!

అమెరికా లాంటి అతిపెద్ద ధనిక దేశానికి అధ్యక్షుడుగా ఉన్న వారు తక్కువ సంపాదన ఆర్జిస్తే ఎలా అధ్యక్షుడికి తగ్గట్టుగా, ఉపాధ్యక్షులకు తగ్గట్టుగానే వారి సంపాదన ఉండాలి.అందుకే ఈ విషయంలో ఇద్దరు పాలకులు గట్టి పోటీ పడ్డట్టుఉన్నారు.

 Joe Biden And Kamala Harris' 2021 Income And Tax Returns, America President Joe-TeluguStop.com

ఒకరిని మించి ఒకరు గత ఏడాది సంపాదనలో ముందున్నారు.అమెరికా రాజకీయ సాంప్రదాయాల ప్రకారం.

అధ్యక్ష , ఉపాధ్యక్షులు ఎవరైనా సరే వారి సంపాదన, ఆస్తుల విషయాలను బహిర్గతంగా వెల్లడించాలి.ఈ ఏడాది తాము ఎంత సంపాదించాము అనేది లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచాలి.

ఈ సంస్కృతీ కొన్ని దేశాలలో ఇప్పటికీ కొనసాగుతోంది కూడా…తాజాగా

ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు బిడెన్ కమలా హారీస్ లు 2021 ఏడాది లో తమ సంపాదన ఎంత అనే వివరాలను వెల్లడించారు.గత ఏడాది అధ్యక్షుడు బిడెన్ సంపాదన 6,10,702 డాలర్ల ఆదాయం ఉండగా, ఈ ఆదాయంలో పై చెల్లించిన పన్ను 1,50,439 డాలర్లు.

అయితే ఈ ఆదాయం మొత్తం బిడెన్ ఒక్కడిదే కాదు ఆయన సతీమణిది కూడా ఇద్దరూ కలిసి సంపాదించిన దానిపై వచ్చిన ఆదాయం.ఇక ఉపాధ్యక్షురాలు ఆమె భర్త కలిసి పొందిన ఆదాయం అక్షరాలా 16,55,563 డాలర్లు.

దీనిపై వారు కట్టిన ట్యాక్స్ మొత్తం 5,23,371 డాలర్లు. 1970 నుంచీ అధ్యక్షుల ఆదాయాలను వెల్లడించే సంస్కృతీ అమెరికాలో ఉందని అందుకే అధ్యక్షుల గత ఏడాది ఆదాయ వివరాలను వెల్లడించమని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.ఇదిలాఉంటే

Telugu Biden, Donald Trump, Kamala Harris-Telugu NRI

ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ అధ్యక్షుడు బిడెన్ ను బీట్ చేసి మరి ముందు వరుసలో ఉందని, ఈ విషయంలో బిడెన్ వెనుకపడ్డారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.ఈ ఒక్క విషయంలోనే కాదు తదుపరి అధ్యక్ష బరిలో కూడా కమలా హారీస్ ముందుఉంటుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.కాగా ట్రంప్ తన హయాంలో తన ఆదాయ వివరాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు దాంతో బిడెన్ ట్రంప్ చేసిన ఈ తప్పును రాజకీయంగా మలుచుకున్నారు. ట్రంప్ తన అక్రమ సంపాదన ఎక్కడ బయట పెట్టాల్సి వస్తుందోనని బయపడ్డారని, అందుకే ఆదాయ వివరాలు వెల్లడించలేదని విమర్సలు గుప్పించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube