గత కొద్దినెలలుగా అమెరికాలో భారతీయ విద్యార్ధుల హత్యలు( Indian Students Deaths ), ఆకస్మిక మరణాలు, భౌతికదాడుల నేపథ్యంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే అగ్రరాజ్యానికి వెళ్లినవారితో పాటు అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వారిని కూడా ఈ పరిణామాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి( US Ambassador Eric Garcetti ) స్పందించారు.అమెరికా విద్యార్ధులు అప్రమత్తంగా వుండాలని, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులు తోటివారితో సన్నిహితంగా వుండాలని, క్యాంపస్‌లోని భద్రతా వనరులను ఉపయోగించుకోవాలని ఎరిక్ గార్సెట్టి పునరుద్ఘాటించారు.మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో .భారతీయ విద్యార్ధుల విషయంలో జరిగిన ఘటనలను అంగీకరించారు.కొన్ని బాధిత కుటుంబాలతో తాను మాట్లాడానని .న్యాయపరమైన అంశాలను తీవ్రంగా పరిగణిస్తామని గార్సెట్టి తెలిపారు.

బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన .వారికి న్యాయం జరిగేలా , నిందితులను చట్టం ముందు నిలబెట్టడంలో అమెరికా ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందని చెప్పారు.ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీలను పాటించాలని గార్సెట్టి సూచించారు.
గుంపులుగా ప్రయాణించడం, సహచరులతో సన్నిహితంగా వుండటం, మాదకద్రవ్యాలకు దూరంగా వుండటం వంటి వాటి అంశాలను ఆయన గుర్తుచేశారు.ప్రతియేటా దాదాపు 2,45,000 మంది భారతీయ విద్యార్ధులు అమెరికన్ క్యాంపస్‌లలో( American Campuses ) విద్యను అభ్యసిస్తున్నందున , విద్యార్ధులు వారి కుటుంబాలకు భద్రత అనేది కీలక సమస్యగా మారిందన్నారు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ఇతర దేశాలతో పోలిస్తే అమెరికన్ కళాశాలల్లో భద్రతపై గార్సెట్టి స్పందిస్తూ.కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, నేరాల రేట్లు, హింసాత్మక నేరాలు ఇటీవలికాలంలో గణనీయంగా తగ్గాయన్నారు.

కాగా.భారతీయ విద్యార్ధుల మరణాలపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్( White House ) స్పందించింది.అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ), ఆయన పరిపాలనా యంత్రాంగం.భారతీయ విద్యార్ధులపై దాడులను అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో భారతీయ , భారత సంతతి విద్యార్ధులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైట్‌హౌస్‌లోని జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ సమన్వయకర్త జాన్ కిర్బీ ఈ ప్రకటన చేశారు.