కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల , ఇంకా అనేక విషయాల పై డిస్కషన్ చేసినట్లు సమాచారం.
ఈ సందర్భంగా.ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని.
కేంద్ర మంత్రి దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సందర్భంగా గజేంద్రసింగ్ షెకావత్ .రెండు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.అంతమాత్రమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు కడితే ఊరుకునే ప్రసక్తి లేదని కెసిఆర్ కి ఈ సందర్భంగా భరోసా ఇచ్చినట్లు సమాచారం.
అంత మాత్రమే కాక త్వరలో కృష్ణ బోర్డు ఆదేశాలు మేరకు రెండు రోజుల్లో అధికారులు ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళటం జరుగుతుంది అని కేంద్రమంత్రి తెలపడం జరిగింది.