పలు రకాల రుచికరమైన ఆహారపదార్ధాలకి పెట్టింది పేరు మన భారతదేశం.అవును, భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న రుచులన్నీ మన పక్కదేశాల్లో కూడా దొరుకుతున్నాయి అంటే అది మన ఆహార పదార్ధాలకి వున్న డిమాండ్ కారణం అని చెప్పుకోవచ్చు.అయితే, దాదాపుగా వాటిని అక్కడ నడుపుతున్నావాళ్లంతా భారత సంతతి వాళ్లే అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే లండన్ లో మాత్రం అది కాస్త రివర్స్ లో ఉంటుంది.బ్రిటన్ చెఫ్ అయినటువంటి ‘అంగస్ డెనూన్’ మన కోల్ కతా ఫేమస్ డిష్ అయినటువంటి బేల్‌పురిని లండన్ లో హోటల్ పెట్టి అమ్ముతున్నాడు.కాగా అతని ఫుడ్ స్టాల్ కి అక్కడ మంచి డిమాండ్ వుంది.కాగా ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కొన్నేండ్ల క్రితం అంగస్ కలకత్తాకు వచ్చాడు.అక్కడి ఝల్మేరి (బేల్ పూరి లాంటి చాట్) అతన్ని బాగా ఆకర్శించింది.
దాంతో లండన్ కు తిరిగి వెళ్లిన వెంటనే ఝల్మురి ఎక్స్ ప్రెస్ పేరుతో ఫుడ్ స్టాల్ ని ప్రారంభించాడు.
దాంతో UK వీధుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ఐటమ్ గా నేడు అది ప్రసిద్ధి పొందింది.దీని గురించి రిచ్ మైండ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ CEO రవి నాయర్ తన లింక్డిన్ అకౌంట్లో పోస్ట్ చేయగా ఈ విషయం వెలుగు చూసింది.దాంతో మన భారతీయ నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు.
మరీ ముఖ్యంగా కలకత్తా వాసులు అయితే తమ డిష్ అక్కడ ఫేమస్ అవ్వడంతో మిక్కిలి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.బేల్‌పూరి అంటే సాధారణ విషయం కాదని వారు చెబుతున్నారు.
కాగా బేల్‌పూరికి కలకత్తాలో వున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.