రెండు లారీలు ఢీ-ఇద్దరు డ్రైవర్లు మృతి

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు.

సూర్యాపేట- జనగామ 365(బి) జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు.సూర్యాపేట నుండి తిరుమలగిరి వైపు ధాన్యం లోడుతో వెళుతున్న టీఎస్03 యూబి 3485 నెంబర్ గల లారీ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి బయల్దేరిన ఏపీ16 టిఈ 5839 బొగ్గు లారీ రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు 4 గంటలు శ్రమించి మృతదేహాలని బయటికి తీశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!

Latest Suryapet News