మోతె ఎంపీడీవో ఆఫీస్ లో ఇద్దరు అధికారుల ఇష్టారాజ్యం

సూర్యాపేట జిల్లా: మోతె మండల ఎంపీడీవో ఆఫీస్ లో చాలా కాలంగా తిష్ట వేసిన సూపరిండెంట్, సీనియర్ అసిస్టెంట్ ఎంపీడీఓను కూడా లెక్కచేయకుండా,సమయపాలన పాటించకుండా ఉదయం 11 గంటలకు డ్యూటీకొచ్చి సాయంత్రం 4 గంటలకే వెళుతూ,ఇష్టారాజ్యంగా సెలవులు పెడుతూ విధులు నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

రోజు మాదిరిగానే సోమవారం కూడా సాయంత్రం 4 గంటలకే వెళ్ళి ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో ఇదే విషయమై ఎంపీడీవోను వివరణ కోరగా నాకు తెలియదని, వారు వెళుతున్నట్లు నాకు ఎలాంటి సమాచారం లేదని,నేను వారికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని చెప్పడం గమనార్హం.

అయితే ప్రస్తుత సూపరిండెంట్ గతంలో ఈ కార్యాలయంలో ఇంచార్జి ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వహించినట్లు తెలుస్తోంది.ఆ ధైర్యంతోనే ఇప్పుడున్న ఎంపీడీవో ఆదేశాలు బేఖాతర్ చేస్తూ ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆఫిస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Two Govt Officers Neglecting Their Duty At Mote MPDO Office, Govt Officers, Negl

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

కానిస్టేబుల్ రాంబాబు మృతి బాధాకరం : ఎస్పీ నరసింహ
Advertisement

Latest Suryapet News