వార్డులో టీఆర్ఎస్ వర్గపోరు

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వార్డులో అధికార పార్టీ నాయకుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది.7వ వార్డుకు చెందిన శెనగాని రాంబాబు అనే నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ,పార్టీని బలహీనపర్చే కుట్ర చేస్తున్నాడని,7 వ, వార్డ్ కౌన్సిలర్ కుంభం రేణుక రాజేందర్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.7 వార్డు కౌన్సిలర్, శెనగాని రాంబాబుపై చేసిన ఫిర్యాదు లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పేటలో హాట్ టాఫిక్ గా మారింది.

TRS Does Not Classify In The Ward-వార్డులో టీఆర్ఎస

Latest Suryapet News