సీనియర్ హీరోయిన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఒకప్పుడు తన సినిమాలతో అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.కాగా ఆమె గత కాలంగా జబర్దస్త్ అనే కామెడీ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.
దీంతో ఆమెకు సినిమాల్లో నటించడం వల్ల వచ్చిన గుర్తింపు కన్నా, ఈ షోకి వచ్చినప్పటి నుంచే అత్యధిక పాపులారిటీ వచ్చిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.అయితే ఈ కామెడీ షోలో దాదాపు 9 సంవత్సరాల నుంచీ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండడగా, కేవలం మార్కులు మాత్రమే ఇచ్చి, చేతులు దులుపుకోవడమే కాకుండా కంటెస్టంట్స్ స్కిట్స్ చేస్తున్నపుడు మధ్య మధ్యలో రోజా కూడా తన స్టైల్‌లో పంచులు వేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది.
ఇక తన డ్యాన్స్, హావ భావాలతో ఇప్పటికే తెలుగు కుర్రకారును కట్టి పడేసిన రోజా, ఇప్పటివరకూ ఆ షోకి ఎంత మంది జడ్జీలు మారుతూ ఉన్నా, ఆమె మాత్రం ప్రారంభం నుంచీ ఇప్పటికీ కొనసాగుతోంది.కొంత మంది కంటెస్టంట్స్ వెళ్లిపోయినా కూడా, కేవలం రోజా వల్లనే ఆ షో ఇంకా అత్యధిక టీఆర్పీ రేటును సొంతం చేసుకుంటుందని భావిస్తున్న వాళ్లూ లేకపోలేదు.
అయితే తాజాగా ఆమె ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాకపోయినా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు.
అదేంటంటే ఆమె జబర్దస్త్ షో కు ఇక గుడ్ బై చెప్పనున్నారని తెగ ప్రచారం జరుగుతోంది.ఇక మరికొన్ని రోజుల్లో బుల్లి తెర నుంచి రోజా కనుమరుగవుతున్నారని తెలిసి ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు.

అసలు దీని వెనక ఉన్న కారణమేంటని ఆరా తీయగా, త్వరలో ఏపీలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రోజాకు ఈ సారి మంత్రి పదవి ఖాయమని పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.అయితే మంత్రి అయితే అదనపు బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి, ఇలాంటి షోలకు వెచ్చించే సమయం అంతగా ఉండదు.కాబట్టి ఒకవేళ అదే గనక జరిగితే ఆమె జబర్దస్త్ షో నుంచి వైదొలగడం ఖాయమని సినీ వర్గాల సమాచారం.ఒకవేళ రోజా గనక వెళ్లిపోతున్నారనేది నిజమైతే జబర్దస్త్ కి చాలా నష్టం జరిగినట్లే.
రోజా స్థాయిలో మరొకరు జబర్దస్త్ షోకి ప్రత్యేకత తీసుకురాలేరు.ఇప్పటికే చాలా మంది స్టార్ కమెడియన్స్ తప్పుకోగా షో పట్ల ఆదరణ తగ్గింది.
సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్ మాత్రమే ఫేవరేట్ గా ఉన్నాయి.ఇక రోజా కూడా నిష్క్రమిస్తే జబర్దస్త్ టీఆర్పీ తగ్గిపోవడం తప్పదని తెలుస్తోంది.







