ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ టైటిల్‌ : మళ్లీ 'అ' సెంటిమెంట్‌ను వదల్లేదుగా

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్‌ సమ్మర్‌లో పూర్తి అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

 Trivikram Ayinanu Poyiravale Hastinaku Ntr Rrr-TeluguStop.com

అతి త్వరలోనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా మొదలు కాబోతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.తనను చాలా నమ్మిన ఎన్టీఆర్‌కు అరవింత సమేత చిత్రంతో సక్సెస్‌ను ఇవ్వలేక పోయాను అని త్రివిక్రమ్‌ భావించడట.

అందుకే మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.అందుకు ఎన్టీఆర్‌ ఓకే చెప్పాడు.

అల వైకుంఠపురంలో చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ క్రేజ్‌ ఇంకా పెరిగింది.చాలా కాలం తర్వాత ఒక మంచి హిట్‌ను ఇచ్చారంటూ అభినందించారు.భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం 300 కోట్ల దిశగా దూసుకు పోతుంది.ఇలాంటి నేపథ్యంలో త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు ఎన్టీఆర్‌ చాలా ఉత్సాహంగా ఉన్నాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత ఏమాత్రం గ్యాప్‌ తీసుకోకుండా ఈ చిత్రాన్ని చేస్తానంటూ ఎన్టీఆర్‌ అన్నాడట.

Telugu Jr Ntr, Trivikram-Latest News - Telugu

కథ సిద్దం చేసే పనిలో ఉన్న త్రివిక్రమ్‌ తాజాగా ఈ సినిమాకు అయినను పోయిరావలే హస్తినకు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాడట.ఈమద్య కాలంలో త్రివిక్రమ్‌ చేసిన ప్రతి సినిమాకు టైటిల్‌ అ తో మొదలు అయ్యేలా పెడుతున్నాడు.అలాగే ఈ సినిమాకు కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవ్వబోతున్నాడు.

అతి త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించడంతో పాటు ఆ టైటిల్‌ను హాసిని హారిక బ్యానర్‌లో రిజిస్ట్రర్‌ చేయించబోతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube