సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందరికీ రావు కొందరికి మాత్రమే ఇక్కడ చాలా అవకాశాలు వస్తాయి.సినిమా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉంటే అవకాశాలు తొందరగా వస్తాయి.లేదా మన నాన్న, తాతలు కానీ ఇండస్ట్రీలో హీరోలుగా ఉంటే అలాంటి సందర్భాల్లో కూడా అవకాశాలు తొందరగా వస్తాయి కానీ ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే ఒక విధంగా కష్టమనే చెప్పాలి అలా ఆ కష్టాన్ని గురించి అవగాహన ఉన్న కొంతమంది వ్యక్తులు ఇండస్ట్రీకి రావడానికి కొన్ని అబద్ధాలు చెప్పి ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అయిపోయారు ముఖ్యంగా హీరోయిన్లు అయితే తెలుగు వారైనా సరే వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే వారికి ఇక్కడ గుర్తింపు ఉండదు అని ముంబై నుంచి వచ్చి అసలు తెలుగు తెలియదు అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ బిహేవ్ చేస్తూ ఉంటారు అలాంటి వారిలో సమీరా రెడ్డి ఒకరు.
సమీరా రెడ్డి
సమీరా రెడ్డి రాజమండ్రి లో జన్మించారు కానీ తను ముంబై నుంచి వచ్చినట్టుగా కలరింగ్ ఇచ్చి ఎన్టీఆర్ తో నరసింహుడు లాంటి సినిమాలో నటించింది అయితే ఎన్టీఆర్ తో విజయ్ మాల్యా వాళ్ళ మామయ్య అని చెప్పి ఎన్టీఆర్ ని మోసం కూడా చేసిందని చెబుతుంటారు.నరసింహుడు తో పాటు అశోక్ సినిమాలో కూడా నటించింది.అప్పుడు ఎన్టీఆర్ కి సమీరా రెడ్డికి మధ్య ఏదో సంబంధం ఉంది అని కూడా వార్తలు వచ్చాయి అలాగే సమీరా రెడ్డి తెలుగులో చిరంజీవి పక్కన జై చిరంజీవ సినిమాలో నటించింది ఈ సినిమాకి కథ మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు దర్శకత్వం విజయ భాస్కర్ గారు చేశారు.
సమీరా రెడ్డి ఇండస్ట్రీలో కొన్ని రోజులు హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించినప్పటికీ ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.మొత్తానికి అయితే తెలుగు అమ్మాయి అయినప్పటికీ ముంబై నుంచి వచ్చినట్టుగా అబద్ధం చెప్పి ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుని కొన్ని రోజుల పాటు హీరోయిన్ గా వెలుగొందింది అని చెప్పవచ్చు.
కామ్నా జఠ్మలానీ
ఈవిడ కూడా తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో మాట్లాడితే ఇక్కడ చులకనగా చూస్తారు అవకాశాలు తొందరగా రావు అనే ఉద్దేశంతో ముంబై నుంచి వచ్చినట్టుగా జనం అందరిని నమ్మించి గోపీచంద్ హీరోగా వచ్చిన రణం సినిమాలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపును సాధించారు అలాగే అల్లరి నరేష్ హీరోగా ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన బెండు అప్పారావ్ RMP సినిమాలో కూడా నటించి తనదైన నటనతో మంచి గుర్తింపు సాధించింది.కామ్నా జఠ్మలానీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది అందుకే సినిమాల్లో అవకాశాలు కూడా ఆమెకి తొందరగానే వచ్చాయి గోపీచంద్, అల్లరి నరేష్ లాంటి హీరోలతో నటించినప్పటికీ తనకి పెద్ద హీరోయిన్ గా గుర్తింపు మాత్రం రాలేదు.ప్రస్తుతం ఆవిడకు అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయారు.
సంపూర్ణేష్ బాబు
హృదయ కాలేయం సినిమా కి ముందు సంపూర్ణేష్ బాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.తను అమెరికా నుంచి వచ్చాడు అని తనకి అక్కడ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ కూడా ఉందని చెప్పాడు అలాగే రాజమౌళి లాంటి దర్శకుడు కూడా తనతో ఒక సినిమా తీస్తానని చెప్పాడు అని సంపూర్ణేష్ బాబు ఇండస్ట్రీతో పాటు జనాలకు కూడా ఆ విషయాన్ని చెప్పి నమ్మించాడు.అలాగే హృదయ కాలేయం సినిమా సక్సెస్ అయిన తర్వాత నేను పుట్టింది సిద్దిపేట దగ్గర అని చెప్పి ఇండస్ట్రీ కి రావడానికి నాకు ఇలాంటి అబద్ధాలు చెప్పడం తప్ప వెనక నుంచి సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరు అందుకే ఇలాంటి అబద్ధాలు చెప్పి ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాను అని కూడా చెప్పాడు ఆ తర్వాత తను సింగం123, కొబ్బరి మట్ట లాంటి సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపును సాధించారు.
ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తూ సంపూర్ణేష్ బాబు బిజీగా ఉన్నారు.
ఇలా ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు రావడం కోసం ఇలాంటి అబద్ధాలు కూడా చెప్పి కొందరు ఇండస్ట్రీ లో అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు.