పేదల భూముల్లో క్రీడా మైదానం వద్దు

సూర్యాపేట జిల్లా:గత ప్రభుత్వాలు నిలువనీడ లేని నిరుపేలేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని టీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా మైదానం కోసం బలవంతంగా లాక్కునే ఆలోచనను వెంటనే విరమంచుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు డిమాండ్ చేశారు.గురువారం రావిపహాడ్ గ్రామంలోని సర్వే నెంబర్ 626,627,628 లలో 6.

37 గుంటల పేదల ఇళ్ల స్థలాల భూమిని లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావిపహాడ్ గ్రామంలో 1992 సంవత్సరంలో పేదల ఇండ్ల నిర్మాణం కోసం 6.37 గుంటల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు.పేదలకు ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించకపోవడం,త్రాగునీరు, సీసీ రోడ్లు,కరెంటు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

There Is No Need For A Sports Field In The Lands Of The Poor-పేదల భూ

పేదలకు గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పట్టాలు కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి పక్కా ఇంటిని నిర్మించాలని డిమాండ్ చేశారు.పేదలను అదుకునేది పక్కన పెట్టి,క్రీడాస్థలం పేరుతో ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేయడమే బంగారు తెలంగాణా? అభివృద్ధి అంటే పేదల భూములు బలవంతంగా గుంజుకోవడమేనా అని ప్రశ్నించారు.గ్రామంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి భూస్వాముల చేతుల్లో ఉందని,ఆ భూమిని బయటకు తీసి దానిలో క్రీడా మైదానాన్ని నిర్మించాలి తప్ప పేదల ఇండ్ల స్థలాల్లో కాదన్నారు.

పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలలో క్రీడా మైదానాన్ని నిర్మిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.పేదలకు ఇళ్లస్థలం దక్కే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

పేదలకు సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి కుంచం గోపయ్య,సిపిఎం మండల కమిటీ సభ్యులు సోమగాని మల్లయ్య,సిపిఎం గ్రామ నాయకులు బాపనపల్లి నాగయ్య,ములకలపల్లి మల్సూర్,వెలుగు వెంకన్న, పొడపంగి ఈదయ్య,కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు వీరమల్ల వెంకన్న,సోమగాని రాంబాబు తదితరు పాల్గొన్నారు.

పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!
Advertisement

Latest Suryapet News