కేంద్ర ఎన్నికల కమిషనర్ నీ కలిసిన వైసీపీ ఎంపీలు..!!

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి( Vijaysai Reddy ) నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ తో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు.ఈ క్రమంలో ఓట్ల తొలగింపు తెలుగుదేశం దుష్ప్రచారాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

 The Ycp Mps Met By The Central Election Commissioner Ycp Mps, Central Election C-TeluguStop.com

ఈసీతో భేటీ అనంతరం.ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు( Chandrababu Naidu ) అధికారంలో ఉన్నప్పుడు భారీ స్థాయిలో ఓట్ల అవకతవకలకు పాల్పడి దొంగ ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్నారని విమర్శించారు.

ఈ క్రమంలో తాము అవకతవకలకి పాల్పడుతున్నట్లు ఆయన అంటుంటే దొంగే దొంగ అన్న చందాన ఉందని అన్నారు.ఎలక్షన్ కమిషన్ కు చేసిన ఫిర్యాదులో 2014 నుంచి నమోదైన దొంగ ఓట్లపై విచారణ జరిపించాలని కోరినట్లు స్పష్టం చేశారు.2014-19 వరకు చంద్రబాబు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారని.ఆ లెక్క సంగతి తేల్చాలని.స్పష్టం చేశారు.

ఇదే సమయంలో దొంగ ఓట్ల ఏరివేత బాధ్యత పూర్తిగా ఈసీ దేనని పేర్కొన్నారు.వెంటనే ఓటర్ కార్డులను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని రాబోయే ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకతతో జరిపించాలని.ఈసీని కోరినట్లు స్పష్టం చేశారు.ఈసారి అత్యంత పారదర్శకతతో ఓట్ల నమోదు కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు.ఏపీలో ఎక్కడ కూడా దొంగ ఓట్ల నమోదు జరగలేదని స్పష్టం చేశారు.ఎన్నికలకు నిజమైన ఓటర్ల జాబితా ఉండాలన్నదే తమ ఉద్దేశం అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

చంద్రబాబు సేవా మిత్రా ఇంకా మై టీడీపీ ( TDP )ద్వారా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.దీనిపై ఈసీ ఫుల్ కమిషన్ ద్వారా విచారణ జరిపిస్తామని.

హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube