రేవంత్ రెడ్డి పదవి పీకేది కాంగ్రెస్ వాళ్లే..: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Jagdish Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఓటమిని అంగీకరించే విధంగా ఉన్నాయని తెలిపారు.

 Congress Will Lose Revanth Reddy's Post: Former Minister Jagadeesh Reddy , Jagd-TeluguStop.com

పీసీసీ చీఫ్, సీఎంగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) భాష హుందాగా లేదని జగదీశ్ రెడ్డి విమర్శించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కుమ్మక్కై మూటలు పంపుతున్నారని ఆరోపించారు.

ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ తీరు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని పేర్కొన్నారు.హోంగార్డ్ ఎస్పీ కాలేడన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు వెంకట్ రెడ్డి నెక్ట్స్ సీఎం అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkat Redd )కి తప్ప కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరికీ ముఖ్యమంత్రిగా అర్హత లేదా అని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పదవిని పీకేది కాంగ్రెస్ వాళ్లేనని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube