సైడ్ అయిన ముగ్గురు అధినేతలు !

జాతీయ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పొత్తుల విషయంలో అమలు చేస్తున్న వ్యూహాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

 The Three Leaders Sided! Cm Kcr , Brs Party , Nda , Bjp, Amith Shah , Politics-TeluguStop.com

విపక్షాలలోని 26 పార్టీలతో కలిసి ” INDIA ” కూటమిని ఏర్పాటు చేసింది కాంగ్రెస్.అటు బీజేపీ కూడా ఎన్డీయే కూటమిలో మిత్రా పక్షాలను ఓ కంట కనిపెడుతూ నిన్న 36 పార్టీల అధినేతలతో సమావేశం కూడా నిర్వహించింది.

ఈ స్థాయిలో హాట్ హాట్ గా సాగుతున్న నేషనల్ పాలిటిక్స్ పై తెలుగు రాష్ట్రాలలోని ఆయా పార్టీల అధినేతలు మౌనం పాటిస్తున్నారు.

<img src="

Telugu Amith Shah, Ap, Brs, Chandra Babu, Cm Kcr, Narendra Modi, Ys Jagan-Politi

“/>

ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారిన అంశం.

టీడీపీ( TDP party ) గత ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే మళ్ళీ ఈసారి ఎన్డీయేలో చేరాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు.

ఎన్డీయే మాత్రం టీడీపీని మిత్రపక్షంలా భావించడం లేదు.తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి సమావేశానికి జనసేన పార్టీని ఆహ్వానించగా టీడీపీకి మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేదు.

దీన్ని బట్టి టీడీపీని బిజెపి దూరం పెడుతోందనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.ఇక వైసీపీ విషయానికొస్తే ఎన్డీయేలో భాగం కాకపోయిన బీజేపీ వైసీపీ మద్య సత్సంబంధాలు ఉన్నాయని ఆ మద్య గట్టిగా వార్తాలు వినిపించాయి కానీ వైసీపీపై బీజేపీ అగ్రనేతలు తీవ్ర విమర్శలు చేయడం, జగన్( CM jagan ) కూడా బీజేపీ తమతో లేదని స్పష్టం చేయడంతో ఎన్డీయేలో వైసీపీ భాగం అయ్యే ఛాన్స్ లేదు.

Telugu Amith Shah, Ap, Brs, Chandra Babu, Cm Kcr, Narendra Modi, Ys Jagan-Politi

ఇక విపక్షాలు సైతం టీడీపీ వైసీపీ లను ఏమాత్రం కన్సిడర్ చేయడం లేదు.దాంతో ఏపీనుంచి ఒక్క జనసేన మినహా టీడీపీ వైసీపీ పాత్ర జాతీయ రాజకీయాల్లో ఈసారి పెద్దగా ఉండే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.అటు తెలంగాణ విషయానికొస్తే మొదటి నుంచి కూడా బి‌ఆర్‌ఎస్ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం పాటిస్తూ వస్తోంది.అందుకే అటు విపక్ష్ల బేటీకి గాని, ఇటు ఎన్డీయే కూటమి సమావేశానికి గాని బి‌ఆర్‌ఎస్ హాజరు కాలేదు.

ఆహ్వానం కూడా అందలేదు.మొత్తానికి దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న వేళ తెలుగు రాష్ట్రాలలోని అధినేతలు కొంత దూరం పాటించడం నిజంగా ఆశ్చర్యమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube