సూర్యాపేట జిల్లా:ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవమని, స్వాతంత్ర్య ఫలితాలు అందరికి పంచాలని రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరియడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలేక్టర్ తేజస్ నందలాల్ పవార్,జిల్లా ఎస్పీ సన్ ప్రిత్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు.
జాతీయ పతకావిష్కరణ చేసి, జాతీయ గీతాన్ని,రాష్ట్ర గీతాన్ని ఆలపించి,గౌరవ వందనాన్ని స్వీకరించి,తదుపరి పోలీస్ శాఖ వారిచే ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ వాహనంలో జిల్లా కలెక్టర్,ఎస్పీలతో కలిసి సంప్రదాయ సిద్ద పోలీస్ కవాతు స్వీకరించారు.తదుపరి మంత్రి మాట్లాడుతూ ప్రియమైన జిల్లా ప్రజలకు, స్వాతంత్ర్య సమరయోధులకు, ఉద్యమకారులకు,జిల్లా న్యాయమూర్తులకు,ప్రజా ప్రతినిధులకు,అధికారులకు,పాత్రికేయులకు,కార్మిక,కర్షక,విద్యార్థిని,విద్యార్థులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 78 వ, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.మా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహాలక్ష్మి,ఆరోగ్యశ్రీ పథకాలను పేదలకు అందించామని,జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసి బస్సులలో 1.29 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ప్రయాణించారని,వీరికి రూ.66.84 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం చెల్లించినదని, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ను అందించుటకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుండి పది లక్షలకి పెంచటం జరిగిందని,జిల్లాలో ఈ పథకం ద్వారా 19096 మంది చికిత్స పొందరాని తెలిపారు.పేదోళ్ల సొంత ఇంటి కలను నెరవేర్చుటకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద రాష్ట్రంలో 4.5 లక్షల ఇల్లులు నిర్మించుటకు ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వటం జరుగుతుందని,హుజుర్ నగర్ ఆదర్శ కాలనిలో 2160 ఇండ్ల పున్నరుద్దరణ పనులు 74.80 కోట్లతో జరుగుతున్నాయని, అలాగే గ్యాస్ సిలిండర్ రూ.500 లకే అందిస్తున్నామని, ఇప్పటి వరకు జిల్లాలో 1.48 లక్షల మంది లబ్ధిదారులకు 7 కోట్ల రూపాయల సబ్సిడీ తో 2.37 లక్షల గ్యాస్ సిలిండర్లు అందజేయటం జరిగిందని, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విధ్యుత్ ని ఉచితంగా అందజేయటం జరిగిందని,జిల్లాలో 1.75 లక్షల కుటుంబాలకు రూ.28.5 కోట్లతో ఉచిత విద్యుత్ ని అందజేయటం జరుగుతుందన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణ మాఫి చేయటం జరిగిందని, జిల్లాలో రెండు విడతలలో కలిపి 82,593 మంది రైతులకు 573 కోట్లు రుణ మాఫి చేయటం జరిగిందన్నారు.పౌర సరఫరాల శాఖ ద్వారా 3.24 లక్షల ఆహార భద్రత కార్డులకి నెలకి 5,946 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణి చేయటం జరిగిందని,అలాగే 43,125 మంది రైతుల ద్వారా 530 కోట్లు విలువగల 2,40,578 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించటం జరిగిందన్నారు.నీటి పారుదల,ఆయకట్టు అభివృద్ధి శాఖ ద్వారా జిల్లాలో 519.77 కోట్లతో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయటం జరిగిందని,418 కోట్లతో నాగార్జున సాగర్ ఎడమ కాలువ పనులు,రూ.144 కోట్లతో మూసి ప్రాజెక్ట్ కాలువ ఆధునికీకరించటం జరిగిందని, 244.45 కోట్లతో 20 చెక్ డ్యామ్లు నిర్మించటం జరుగుతుందని,వీటిలో 19 పూర్తి అయ్యాయని,జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం కింద రూ.40 కోట్లతో 210 ఎకరాల భూమిని సేకరించటం జరిగిందన్నారు.కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాల కింద రూ.389.14 కోట్ల విలువ గల చెక్కులను 43,711 లబ్ధిదారులకు ఇవ్వటం జరిగిందని,ధరణిలో జిల్లాలో 56,266 దరఖాస్తులు వచ్చాయని,వాటిలో 94 శాతం పరిష్కరించామన్నారు.పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జిల్లాలో ఆగస్టు 5 నుండి ఆగస్టు 9 వరకు స్వచ్చదనం-పచ్చదనం విజయవంతంగా చేయటం జరిగిందని,మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా 2,62,000 మందికి జాబ్ కార్డులు ఇవ్వటం జరిగిందని, వీరికి 49,12,000 పనిదినాలు ఉపాధి కల్పించామని, దీనికి గాను రూ.107.38 కోట్లు చెల్లించామని,49,044 మందికి రూ.36.94 కోట్లు పింఛన్ ఇవ్వటం జరుగుతుందని, 1057 సదరం సర్టిపికెట్స్ ఇచ్చామని,బ్యాంక్ లింకేజి ద్వారా ఎస్.హెచ్.జి లకు రూ.198.18 లక్షల రుణాలు ఇచ్చామని,రూ.9.92 కోట్ల వడ్డీ రుణమాఫి చేయటం జరిగిందని,జిల్లాలో సిసి రోడ్లు, డి.ఎం ఎఫ్.టి.సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా 793 పనులకు రూ.52.85 కోట్లు మంజూరయ్యాయని,617 పనులు పూర్తి చేశామని అలాగే జిల్లాలోని ఐదు మున్సిపాల్టిలలో రూ.108 కోట్లతో పనులు మంజూరుయ్యాయని,పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.జిల్లాలో 24 పి.హెచ్.సి,122 పల్లె దవాఖానాలు,5 పట్టణారోగ్య కేంద్రాలు,161 ఆరోగ్య కేంద్రాలు,1 జనరల్ అస్పత్రి,3 ఏరియా హాస్పిటల్స్, 1 సి.హెచ్.సిలు ఉన్నాయని, జిల్లాలోని గ్రామాలలో,పట్టణాలలో, పాఠశాలలో పీవర్ సర్వే చేయటం జరిగిందన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులు అనుక్షణం పనిచేస్తూ ప్రజలకు మెరుగైన భద్రత, రక్షణ కల్పిస్తున్నారని, గంజాయి,ఇతర నార్కోటిక్ డ్రగ్స్ పదార్దాలపై ఉక్కుపాదం మోపి అణిచివేయాలని,డ్రగ్స్ రహిత సమాజానికి ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి, గృహజ్యోతి,రైతుభరోసా ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలు అమలు కొరకు నిరంతరం కృషి చేస్తానని,జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రికి,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు,ఎంపీలకు స్థానిక ప్రజాప్రతినిధులకు, ప్రజలకు,పాత్రికేయులకు, జిల్లా అధికార యంత్రాగానికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తునన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా మంత్రి హోదాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని,నన్ను 6 సార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి ఎంపీగా గెలిపించారని,ఈ అదృష్టం కల్పించిన జిల్లా ప్రజలకు ధన్యవాదములు తెలిపారు.ఏ తండాలో అయినా,హరిజన వాడలో అయినా,ఏ గ్రామాంలో అయినా ఉత్తమన్నా మీతోనే ఉంటాడని, సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని,జిల్లా ప్రజల జీవితాలలో వెలుగు నింపటమే నా లక్ష్యమని స్పష్టం చేశారు.
స్వాతంత్ర్య సమరయోధులైన సూర్యాపేట నివాసి అంజయ్య,గరిడేపల్లి నివాసి పుల్లారెడ్డి, సూర్యాపేట నివాసి జానకి రాములకు సన్మానం చేశారు.తదుపరి విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను విక్షించి విద్యార్థులతో ఫొటోలు దిగి ప్రోత్సాహించారు.రూ.52.44 కోట్ల చెక్కును స్వయం సహాయక సంఘాల వారికి, రూ.35.36 కోట్ల చెక్కును మెప్మా వారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగశ్వరరావు,ఆర్డీఓ వేణుమాధవరావు,జడ్పీ సిఈఓ అప్పారావు,డిపిఓ యాదగిరి,డిడబ్ల్యూఓ నరసింహరావు,డిటిడిఓ శంకర్,డిఈఓ ఆశోక్, ఉద్యోగులు,సిబ్బంది, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy