కొడుకు ఒత్తిడితో లాట‌రీ కొన్న‌ది.. అదృష్టం త‌లుపు త‌ట్టింది

ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఎప్పుడో ఒక‌సారి క‌చ్చితంగా మార్పు అనేది వ‌స్తుంది.అయితే అది అదృష్ట రూపంలో వ‌స్తే మాత్రం ఎలా వ‌స్తుందో చెప్ప‌డం క‌ష్టం.

 The Mother Bought The Lottery Under Pressure Of Son Good Luck Favoured, Lottery-TeluguStop.com

అదృష్టం అనేది ఎవ‌రూ ఊహించ‌ని గిఫ్ట్‌.దాన్ని ఓపెన్ చేసి తీసుకోవడం మాత్ర‌మే మ‌న వంతు.

కానీ అది ఏ రూపంలో వ‌స్తుందో ఎప్పుడు వ‌స్తుందో చెప్పడం అంత ఈజీ కాదు.ఇక పోతే ఈ మ‌ధ్య రాత్రికి రాత్రి కోటీశ్వ‌రులు అవుతున్న వారిని కూడా మ‌నం చూస్తున్నాం.

ఇందులో మ‌రీ ముఖ్యంగా లాట‌రీల‌తో అవుతున్న వారే ఎక్కువ ఉంటారు.ఒక్క లాట‌రీ త‌గిలిందంటే చాలు ద‌శ తిరిగిపోతుంది.

ఇక‌పోతే ఇప్పుడు కూడా ఇలాంటి వారి గురించే చెప్పుకోబోతున్నాం.ఆ మ‌హిళ కావాల‌ని కొన‌క‌పోయినా అదే త‌న జీవితాన్ని మార్చేసింది.అదెలాగో తెలుసుకుందాం.ఇంగ్లాండ్ దేశానికి చెందిన‌టువంటి 60 ఏళ్ల కాథ్లీన్ మిల్లర్, ఆమె కొడుకు పాల్ ఇద్దరూ ఇక్క‌డ జీవిస్తున్నారు.

అయితే కొడుకు పాల్ నిత్యం పీపుల్స్ పోస్ట్‌కోడ్ లాటరీని కొంటూ ఉండేవాడంట‌.అయినా అత‌నికి మాత్రం ఏనాడ అదృష్టం త‌గ‌ల్లేదు.

ఇక అత‌ని త‌ల్లి మాత్రం ఎన్న‌డూ ఆ లాట‌రీ కొన‌లేదు.కానీ ఓ రోజు కొడుకు కోరిక మేర‌కు జీవితంలో మొద‌టిసారి ఆమె లాట‌రీ కొనుగోలు చేసింది.

Telugu Lottery, England, Matt Johnson, Mothercatheline, Peoples Lotters, Son Pau

కానీ అదే ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.ఇక ఆమె లాట‌రీ ప్రైజ్ మ‌నీ గెలుచుకుంది.పీపుల్స్ పోస్ట్‌కోడ్ లాటరీ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న‌టువంటి మాట్ జాన్సన్ ఆమె ఇంటికి వెళ్లి మ‌రీ ప్రైజ్ మనీని అంద‌జేశారు.ఆమె త‌న‌కు ఈ లాట‌రీ త‌గులుతుంద‌ని ఊహించ‌లేద‌ని, కేవ‌లం కొడుకు కోసం మాత్ర‌మే కొన్నాన‌ని చెప్పుకొచ్చింది.ఈ లాట‌రీ ద్వారా 30ల‌క్ష‌లు ఆమె గెలుచుకున్నారు.ఈ విష‌యాన్ని జాన్స‌న్ వివ‌రించారు.

కాగా ఈ విష‌యం నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతుంది.అంద‌రూ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube